Viral: యాపిల్‌ స్టోర్‌కు పోటెత్తిన ప్రజలు.. క్యూలైన్‌లో నిలబడి మరీ

యాపిల్‌ బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్రాండ్‌ నుంచి మార్కెట్లోకి ఏదైనా కొత్త ప్రొడక్ట్‌ వస్తుందంటే చాలు అందరి దృష్టి పడుతుంది. తాజాగా యాపిల్‌ ఐఫోన్‌ 16 సిరీస్‌తో మరోసారి ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా యాపిల్ లవర్స్‌ కొత్త సిరీస్‌ను కొనేందుకు..

Viral: యాపిల్‌ స్టోర్‌కు పోటెత్తిన ప్రజలు.. క్యూలైన్‌లో నిలబడి మరీ
Viral Video
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 13, 2024 | 6:09 PM

యాపిల్‌ బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్రాండ్‌ నుంచి మార్కెట్లోకి ఏదైనా కొత్త ప్రొడక్ట్‌ వస్తుందంటే చాలు అందరి దృష్టి పడుతుంది. తాజాగా యాపిల్‌ ఐఫోన్‌ 16 సిరీస్‌తో మరోసారి ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా యాపిల్ లవర్స్‌ కొత్త సిరీస్‌ను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన ఫీచర్లకు పెద్దపీట వేస్తూ యాపిల్ ఐఫోన్‌ 16 సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

ఈ సిరీస్‌ల నుంచి ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ప్లస్‌, ఐఫోన్‌ 16 ప్రో, ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ ఫోన్‌లను తీసుకొచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా టెక్‌ లవర్స్‌ దీని గురించే చర్చించుకుంటున్నారు. ఇక ఎప్పటిలాగే యాపిల్ స్టోర్స్‌ ముందు జనాలను పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. తాజాగా మలేషియలో ఇలాంటి ఓ దృశ్యమే కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇప్పటికే వీడియోను ఏకంగా 5 లక్షల మంది వీక్షించడం విశేషం.

వైరల్ వీడియో..

మలేషియాలో తొలి యాపిల్ స్టోర్‌ను తాజాగా ప్రారంభించారు. దీంతో ఈ స్టోర్‌కు భారీగా ప్రజలు క్యూ కట్టారు. యాపిల్‌ ది ఎక్స్ఛేంజ్‌ టీఆర్‌ఎక్స్‌ పేరుతో ఓపెన్‌ చేసిన ఈ స్టోర్ ప్రారంభోత్సవ సందర్భంగా కంపెనీల పలు ఈవెంట్స్‌ను సైతం నిర్వహించింది. జోమ్‌ డిస్కర్‌ పేరుతో నిర్వహించిన ఈవెంట్‌కు ప్రజలను ఆహ్వానిస్తూ కంపెనీ ప్రకటన చేసింది. దీంతో స్టోర్‌ ముందు పెద్ద ఎత్తున ప్రజలు క్యూ కట్టారు. దీతనంటినీ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. యాపిల్‌కు ఉన్న క్రేజ్‌కు ఇదే నిదర్శమని పలువురు నెటిజెన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..