నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి:దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిసాయి. బాంబే స్టాక్‌ ఎక్స్‌ఛేంజి సూచీ సెన్‌సెక్స్‌ 241 పాయింట్ల నష్టంతో 36153 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌ సూచీయైన నిఫ్టీ కూడా 57 పాయింట్లు నష్టపోయి 10831 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికన్‌ డాలరుతో రూపాయి విలువ 71.17గా ఉంది. నేటి మార్కెట్‌ను ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ రంగ షేర్లు కుంగదీశాయి. యూనియన్‌ బ్యాంక్‌ షేర్లు 1.75శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసు సుచీ 1.09శాతం కుంగాయి. మరోపక్క […]

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2020 | 8:00 PM

ముంబయి:దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిసాయి. బాంబే స్టాక్‌ ఎక్స్‌ఛేంజి సూచీ సెన్‌సెక్స్‌ 241 పాయింట్ల నష్టంతో 36153 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌ సూచీయైన నిఫ్టీ కూడా 57 పాయింట్లు నష్టపోయి 10831 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికన్‌ డాలరుతో రూపాయి విలువ 71.17గా ఉంది. నేటి మార్కెట్‌ను ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ రంగ షేర్లు కుంగదీశాయి.

యూనియన్‌ బ్యాంక్‌ షేర్లు 1.75శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసు సుచీ 1.09శాతం కుంగాయి. మరోపక్క ఎడల్‌వైజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసు, హెచ్‌డీఎప్‌సీ షేర్లు కూడా నష్టపోయాయి. గుజరాత్‌ నర్మదా వ్యాలీ ఫర్టిలైజర్స్‌ షేర్లు 12శాతం పడిపోయాయి. ఈ కంపెనీ లాభంలో 27 శాతం కుంగటం దీనికి ప్రధాన కారణం. మరోపక్క హిందాల్కో లాభం కూడా మూడో త్రైమాసికంలో 37శాతం తగ్గింది.