లాక్‌డౌన్ ఎఫెక్ట్‌: ఇంట్లో కుమారుని మృత‌దేహం… నేపాల్‌లో త‌ల్లిదండ్రులు విల‌విల

కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ధాటికి చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. కుమారుని మృత‌దేహం ఇంట్లో ప‌డివుంది. విష‌యం తెలుసుకున్న వృద్ధ త‌ల్లిదండ్రులు నేపాల్‌లో రోదిస్తున్నారు. అదేవిధంగా తండ్రి మృతితో

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌: ఇంట్లో కుమారుని మృత‌దేహం... నేపాల్‌లో త‌ల్లిదండ్రులు విల‌విల
Follow us

| Edited By:

Updated on: May 03, 2020 | 5:52 PM

Lockdown: కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ధాటికి చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. కుమారుని మృత‌దేహం ఇంట్లో ప‌డివుంది. విష‌యం తెలుసుకున్న వృద్ధ త‌ల్లిదండ్రులు నేపాల్‌లో రోదిస్తున్నారు. అదేవిధంగా తండ్రి మృతితో అత‌ని కుమార్తె ఆరోగ్యం క్షీణించింది. క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా ఒక‌వైపు ఉపాధి కోల్పోగా, మ‌రోవైపు అనుబంధాలు క‌ళ్ల‌ముందే క‌నుమ‌రుగ‌య్యాయి.

కాగా.. యూపీలోని పీలీభీత్‌లోని బిల్సండా ప‌రిధిలోని న‌కా గ్రామానికి చెందిన 75 మంది తమ భార్యాపిల్ల‌లతో పాటు ఇద్ద‌రు ఏజెంట్ల సాయంతో నేపాల్ వెళ్లారు. వారిలో బాబూరామ్, అత‌ని భార్య రాజ‌కుమారి కూడా ఉన్నారు. వీరంతా అక్క‌డి ధార్కే ప్రాంతంలో ప‌నికి కుదిరారు. అయితే లాక్ డౌన్ కార‌ణంగా అక్క‌డ చిక్క‌కుపోయారు. అలాగే వారి ఉపాధి కూడా కోల్పోయారు.

ఇదే సమయంలో.. ఇక్క‌డ మ‌క‌రంద్‌పూర్‌లో బాబూరామ్ కుమారుడు సూర‌జ్‌పాల్ అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ స‌మాచారం నేపాల్‌లో చిక్కుకున్న‌బాబూరామ్‌కు తెలిసింది. అయితే లాక్ డౌన్ కార‌ణంగా  కుమారుని అంత్య‌క్రియ‌ల‌కు కూడా హాజ‌రుకాలేని స్థితిలో త‌ల్లిదండ్రులు ఉన్నారు. భార‌త‌ ప్ర‌భుత్వం త‌మ‌ను ఆదుకోవాల‌ని వారు కోరుతున్నారు.

Also Read: గుడ్ న్యూస్: నెల రోజుల్లో కరోనా వ్యాక్సిన్.. భారత్ నుంచే..!