ఎక్సైజ్ శాఖ ఆదాయానికి గండి కొట్టిన కరోనా

కరోనా మహమ్మారి ప్రపంచంలో అన్ని రంగాలను ప్రభావితం చేసింది. దీంతో ఆర్థిక రంగం బాగా కుదేలైంది. ఈ మహమ్మారి దాటికి అగ్రరాజ్యాలు సైతం తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటు దేశ ఆర్థిక రంగాన్ని కరోనా కుదేలు చేసింది. కరోనా దెబ్బకు కర్ణాటక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎక్సైజ్ ఆదాయంలో భారీగా గండి పడింది.

ఎక్సైజ్ శాఖ ఆదాయానికి గండి కొట్టిన కరోనా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 08, 2020 | 2:32 PM

కరోనా మహమ్మారి ప్రపంచంలో అన్ని రంగాలను ప్రభావితం చేసింది. దీంతో ఆర్థిక రంగం బాగా కుదేలైంది. ఈ మహమ్మారి దాటికి అగ్రరాజ్యాలు సైతం తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటు దేశ ఆర్థిక రంగాన్ని కరోనా కుదేలు చేసింది. కరోనా దెబ్బకు కర్ణాటక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎక్సైజ్ ఆదాయంలో భారీగా గండి పడింది. అధికారిక లెక్కల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఎక్సైజ్ శాఖ ఆదాయం 3,846.76 కోట్లు మాత్రమే వసూలు కాగా, గతేడాది ఇదే కాలానికి రూ.5,760.14 కోట్ల ఆదాయం వచ్చింది. 2019తో పోలిస్తే 2020లో రూ.1,913.38 కోట్ల ఆదాయం తగ్గిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్‌లో ఆదాయం రాలేదని, వైన్స్, బార్లు పూర్తిగా మూసేయడంతో ప్రభుత్వం రూ.2,300 కోట్ల ఆదాయాన్ని కోల్పోవలసి వచ్చిందని ఎక్సైజ్ అధికారి ఒకరు తెలిపారు. రిటైల్ మద్యం దుకాణాలు, ఎంఎస్ఐఎల్ దుకాణాలను మే 4 నుంచి తెరవడానికి అనుమతించారు. అయినా అనుకున్న స్థాయిలో అమ్మకాలు లేకపోవడంతో ఆదాయానికి గండిపడిందన్నారు.

గత మూడు నెలలతో పోలిస్తే కర్ణాటకలో ఇండియన్ మేడ్ లిక్కర్ అమ్మకాలు 33.88 శాతం కుప్పకూలిపోయాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఐఎంఎల్ అమ్మకాలు రూ.100.76 లక్షల కేసులు కాగా, గత సంవత్సరంలో రూ.152.38 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. మే 7న అదనపు ఎక్సైజ్ డ్యూటీ ను ఐఎంఎల్ మొత్తం 18 స్లాబులపై 17% నుంచి 21%, 25% పైన పెంచింది. 6 శాతం ఏఈడీను ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ విధించి అదనపు సుంకం ప్రభావంతోనూ అమ్మకాలు తగ్గినట్లు అధికారులు భావిస్తున్నారు.

Latest Articles
దానిమ్మ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం!
దానిమ్మ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం!
హెయిర్ డై మచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్ చిట్కాలతో వదిలించవచ్చు
హెయిర్ డై మచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్ చిట్కాలతో వదిలించవచ్చు
రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ సహజంగా పెంచే ఆహారాలు ఇవే..
రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ సహజంగా పెంచే ఆహారాలు ఇవే..
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం