ఎట్టకేలకు తమిళనాట లాక్‌డౌన్‌ సడలింపు.. వీటికే గ్రీన్ సిగ్నల్

ఎట్టకేలకు తమిళనాడు లాక్ డౌన్ ఆంక్షల సడలింపు పర్వం మొదలైంది. కరోనా వైరస్‌తో విలవిలలాడిన తమిళనాడులో మెల్లిగా నార్మల్ లైఫ్ ప్రారంభం కానుంది. పాఠశాలలు, సినిమా థియేటర్లను తిరిగి తెరిచేందుకు ఫళనిస్వామి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఎట్టకేలకు తమిళనాట లాక్‌డౌన్‌ సడలింపు.. వీటికే గ్రీన్ సిగ్నల్
Rajesh Sharma

|

Oct 31, 2020 | 7:20 PM

Lock-down relaxations in Tamilnadu state: కరోనా వైరస్ తాకిడికి విలవిలలాడిన తమిళనాడు రాష్ట్రం మెల్లిగా కోలుకుంటోంది. పాజిటివ్ కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల కనిపిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం ఇదివరకే నిర్దేశించిన సడలింపులను అమలు పరిచేందుకు తమిళనాడు ప్రభుత్వం రెడీ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్‌కు సడలింపులు ప్రకటించినా రాష్ట్రంలో తీవ్రత తగ్గలేదన్న కారణంతో ఆ సడలింపులను ఇంతవరకు అమలు పరచని తమిళనాడు ఫళనిస్వామి ప్రభుత్వం తాజాగా లాక్ డౌన్‌కు సడలింపులను ప్రకటించింది.

నవంబర్ నెల 16వ తేదీ నుండి రాష్ట్రంలో పాఠశాలలను ప్రారంభించాలని తమిళ సర్కార్ నిర్ణయించింది. పాఠశాలల పున: ప్రారంభంలో ఉన్నత తరగతులు అంటే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకే తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం తలపెట్టింది. సినిమా థియేటర్లు, పబ్లిక్ పార్కులు, హోటళ్ళను నవంబర్ 10వ తేదీ నుంచి తెరుచుకునేందుకు అనుమతి జారీ చేసింది. అయితే నిర్దిష్టమైన షరతులను విదించింది ప్రభుత్వం.

రాష్ట్రంలో సినిమా షూటింగులకు అనుమతిస్తూనే కొన్ని షరతులు విధించారు. షూటింగులు జరిగే ప్రాంతాలకు సాధారణ ప్రజలను అనుమతించవద్దని నిర్దేశించారు. సినిమా షూటింగుల్లో 150 మందికి మించి సిబ్బంది వుండొద్దని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. స్వదేశీ, విదేశీ విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం అనుమతించిన వాటికి మాత్రమే ఓకే చెప్పింది తమిళనాడు ప్రభుత్వం.

ALSO READ: గ్రేటర్ ఎన్నికల దిశగా మరో అడుగు.. ఈసారి ఏంటంటే..?

ALSO READ: మోదీకి జగన్ లేఖ.. నిధులివ్వకపోతే..!

ALSO READ: కమలనాథులకు కేసీఆర్ ఓపెన్ ఛాలెంజ్

ALSO READ: 60 స్కాములు..30వేల కోట్ల దోపిడీ… నితీశ్‌పై మోదీ ధ్వజం!

ALSO READ: ఆఖరి నిమిషంలో వరునికి షాకిచ్చిన వధువు

ALSO READ:  సూరత్‌లో గోల్డ్ స్వీటు..ఖరీదు కిలో 9వేలు

ALSO READ: పోలీస్‌స్టేషన్‌పై దాడి..ధర్నాతో రెచ్చిపోయిన మహిళలు

ALSO READ: ఒక్క కారు..మూడు బైకులు.. ఒకేసారి ఢీ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu