గ్రీన్ జోన్ల‌లో మ‌ద్యం అమ్మ‌కాలు ఓకే…కానీ ఈ రూల్స్ త‌ప్ప‌నిస‌రి

దేశంలో లాక్ డౌన్ 3.O అమ‌లు చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం గ్రీన్ జోన్ల‌లో భారీ స‌డ‌లింపులిచ్చింది. ఈ క్ర‌మంలోనే మందు బాబుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. గ్రీన్​ జోన్లలో మద్యం షాపుల‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చింది కేంద్రం. లాక్​డౌన్​ పొడిగింపు మార్గదర్శకాల్లో ఈ విషయాన్ని స్ప‌ష్టంగా చెప్పింది. అయితే మద్యం అమ్మకాలకు సంబంధించి పలు రూల్స్ త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని చెప్పింది కేంద్రం. గ్రీన్‌జోన్లలో మద్యం షాపులు, పాన్ షాపులకు ప‌ర్మిష‌న్ మ‌ద్యం షాపుల‌ వద్ద కనీసం 6 అడుగులు […]

గ్రీన్ జోన్ల‌లో మ‌ద్యం అమ్మ‌కాలు ఓకే...కానీ ఈ రూల్స్ త‌ప్ప‌నిస‌రి
Follow us

|

Updated on: May 02, 2020 | 9:25 AM

దేశంలో లాక్ డౌన్ 3.O అమ‌లు చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం గ్రీన్ జోన్ల‌లో భారీ స‌డ‌లింపులిచ్చింది. ఈ క్ర‌మంలోనే మందు బాబుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. గ్రీన్​ జోన్లలో మద్యం షాపుల‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చింది కేంద్రం. లాక్​డౌన్​ పొడిగింపు మార్గదర్శకాల్లో ఈ విషయాన్ని స్ప‌ష్టంగా చెప్పింది. అయితే మద్యం అమ్మకాలకు సంబంధించి పలు రూల్స్ త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని చెప్పింది కేంద్రం.

  • గ్రీన్‌జోన్లలో మద్యం షాపులు, పాన్ షాపులకు ప‌ర్మిష‌న్
  • మ‌ద్యం షాపుల‌ వద్ద కనీసం 6 అడుగులు భౌతిక దూరం పాటించాలి
  • షాపు వద్ద ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువమంది ఉండకూడదు
  • మ‌ద్యం షాపుల్లో ప‌నిచేసేవాళ్లు రెగ్యుల‌ర్ గా శానిటైజ‌ర్లు, మాస్కులు వినియోగించాలి

ఇక‌ వివాహాలు, అంత్యక్రియలపై కూడా కేంద్రం చేసిన ప‌లు సూచ‌న‌లు

  • వివాహాలు వంటి శుభకార్యాలకు 50 కంటే ఎక్కువ మందికి ప‌ర్మిష‌న్ ఉండదు
  • అంత్యక్రియలు వంటి కార్యక్రమాలకు 20 కంటే ఎక్కువ మందికి నో ప‌ర్మిష‌న్
  • బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే ఫైన్ వేయాలని ఆదేశం
  • బహిరంగ ప్రదేశాల్లో మద్యం, పాన్‌, గుట్కా, పొగాకు నమలడం బ్యాన్