జూన్ 11 వ‌ర‌కు స్కూళ్ల‌కు సెల‌వులు

జూన్ 11 వ‌ర‌కు స్కూళ్ల‌కు సెల‌వులు

విద్యార్థుల‌కు వేస‌వి సెల‌వులు వ‌చ్చేశాయి. రాష్ట్రంలో అన్ని స్కూళ్ల‌కు జూన్ 11 వ‌ర‌కూ సెల‌వులు ఇస్తున్న‌ట్లు ఏపీ పాఠ‌శాల విద్యాశాఖ ప్ర‌క‌టించింది. స్కూళ్ల‌ను ఎప్పుడు తిరిగి తెరుస్తామ‌నేది రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు ఆధార‌ప‌డి ఉంటుంద‌ని వెల్ల‌డించింది…ప్ర‌భుత్వం నుంచి ఆదేశాలు వ‌చ్చిన వెంట‌నే ఈ విష‌యంపై ప్ర‌క‌ట‌న చేస్తామ‌ని తెలిపింది. కాగా, ఏపీలో 1-6వ త‌ర‌గ‌తి వ‌ర‌కూ విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు లేకుండా పైత‌ర‌గ‌తుల‌కు రాష్ట్ర‌ప్ర‌భుత్వం ప్ర‌మోట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఏపీలో స్కూల్ ఫీజుల గురించి ఇటీవల […]

Jyothi Gadda

|

May 02, 2020 | 7:03 AM

విద్యార్థుల‌కు వేస‌వి సెల‌వులు వ‌చ్చేశాయి. రాష్ట్రంలో అన్ని స్కూళ్ల‌కు జూన్ 11 వ‌ర‌కూ సెల‌వులు ఇస్తున్న‌ట్లు ఏపీ పాఠ‌శాల విద్యాశాఖ ప్ర‌క‌టించింది. స్కూళ్ల‌ను ఎప్పుడు తిరిగి తెరుస్తామ‌నేది రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు ఆధార‌ప‌డి ఉంటుంద‌ని వెల్ల‌డించింది…ప్ర‌భుత్వం నుంచి ఆదేశాలు వ‌చ్చిన వెంట‌నే ఈ విష‌యంపై ప్ర‌క‌ట‌న చేస్తామ‌ని తెలిపింది. కాగా, ఏపీలో 1-6వ త‌ర‌గ‌తి వ‌ర‌కూ విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు లేకుండా పైత‌ర‌గ‌తుల‌కు రాష్ట్ర‌ప్ర‌భుత్వం ప్ర‌మోట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఏపీలో స్కూల్ ఫీజుల గురించి ఇటీవల రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ ఆర్.కాంతారావు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలు, జూనియర్ కాలేజీలు అన్నీ కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మొదటి త్రైమాసికానికి సంబంధించిన ఫీజులు మాత్రమే తీసుకోవాలి (విద్యా సంవత్సరం ఆరంభంలో). అది కూడా ఒకేసారి అడగకూడదు. రెండు విడ‌తల్లో తీసుకోవాలి. మొదటి త్రైమాసికానికి సంబంధించిన ఫీజులో సగం చెల్లించిన 45 రోజుల తర్వాత రెండో సగం అడగాలి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలి. ఇతరత్రా ఎలాంటి రకాల ఫీజులు వసూలు చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu