శృంగారం ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందా..!

శృంగారం ద్వారా క‌రోనావైర‌స్ వ్యాప్తి చెందకపోవచ్చని అమెరికా, చైనా సైంటిస్టుల‌ తాజా పరిశోధనలో వెల్లడైంది. పురుషుల స్పె‌ర్మ్ లేదా వృషణాల్లో కోవిడ్-19‌ ఉన్నట్లు ప్రూప్స్ లేవని తేలింది. జికా, ఎబోలా.. కొత్తగా పుట్టుకొస్తున్న ఇతర వైరస్‌ల తరహాలో క‌రోనా కారక ‘సార్స్‌-కోవ్‌-2’ కూడా సెక్స్ ద్వారా వ్యాప్తి చెందొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో సైంటిస్టులు ఈ పరిశోధన చేశారు. దీనిలో భాగంగా చైనాలో 34 మంది క‌రోనా రోగుల స్పె‌ర్మ్ శాంపిల్స్ విశ్లేషించారు. వీటిలో వైరస్ జాడ‌‌ కనిపించలేదు. […]

శృంగారం ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందా..!
Follow us

|

Updated on: Apr 24, 2020 | 4:52 PM

శృంగారం ద్వారా క‌రోనావైర‌స్ వ్యాప్తి చెందకపోవచ్చని అమెరికా, చైనా సైంటిస్టుల‌ తాజా పరిశోధనలో వెల్లడైంది. పురుషుల స్పె‌ర్మ్ లేదా వృషణాల్లో కోవిడ్-19‌ ఉన్నట్లు ప్రూప్స్ లేవని తేలింది. జికా, ఎబోలా.. కొత్తగా పుట్టుకొస్తున్న ఇతర వైరస్‌ల తరహాలో క‌రోనా కారక ‘సార్స్‌-కోవ్‌-2’ కూడా సెక్స్ ద్వారా వ్యాప్తి చెందొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో సైంటిస్టులు ఈ పరిశోధన చేశారు. దీనిలో భాగంగా చైనాలో 34 మంది క‌రోనా రోగుల స్పె‌ర్మ్ శాంపిల్స్ విశ్లేషించారు. వీటిలో వైరస్ జాడ‌‌ కనిపించలేదు. అయితే స్పె‌ర్మ్ తయారయ్యే వృషణాల్లోకి కూడా ఈ వైరస్‌ ప్రవేశించలేదని చెప్ప‌డానికి మ‌రికొంత రీసెర్చ్ అవ‌స‌ర‌మ‌ని సైంటిస్టులు తెలిపారు.

ఇదే అంశంపై మ‌రింత క్లారిటీ కోసం సైంటిస్టులు.. ఆరోగ్యవంతులైన యువకులకు సంబంధించిన ‘సింగిల్‌ సెల్‌ ఎంఆర్‌ఎన్‌ఏ’ నుంచి సేకరించిన గ‌త‌ డేటాను విశ్లేషించారు. వృషణాల్లోని కణాల్లో ప్రొటీన్ల తయారీకి ఈ ఎంఆర్‌ఎన్‌ఏ ఉప‌క‌రిస్తోంది. అందులో కొవిడ్‌-19తో ముడిపడిన ఏసీఈ-2, టీఎంపీఆర్‌ఎస్‌ఎస్‌2 జన్యువులపై పరిశోధకులు ఫోక‌స్ పెట్టారు. ఇవి రిసెప్టార్లలా వ‌ర్క్ చేస్తూ కణాల్లోకి కరోనావైరస్ ఎంట‌ర‌వ్వ‌డానికి వీలు కల్పిస్తాయి. ఈ రెండు రిసెప్టార్లు ఒకే కణంలో ఉంటేనే ఆ వైరస్‌ సమర్థంగా అందులోకి ప్రవేశిస్తుంది. అయితే 6500 వృషణ కణాలకుగాను..కేవ‌లం నాలుగింటిలోనే ఈ రెండు ప్రొటీన్లను ప్రొడ్యూస్ చేసే జన్యువులు ఉన్నాయని తేలింది. ఈ రిపోర్ట్స్ ద్వారా మానవ వృషణ కణాల్లోకి ఈ వైరస్ ప్ర‌వేశించే అవకాశం లేదని సైంటిస్టులు తెలిపారు. ఇది ప్రైమ‌రీ లెవ‌ల్ అనాల‌సిస్ అని, మరింత లోతుగా పరిశీలన సాగాలని వారు పేర్కొన్నారు.