AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19: ప్రభుత్వాసుపత్రులకు కొత్త పరేషాన్.. ఏంటంటే?

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య గత కొన్ని రోజులుగా గణనీయంగా తగ్గుతోంది. వందల్లో రోగులొచ్చే ఆసుపత్రులకిపుడు పదుల సంఖ్యలో రోగులు రావడం గగనమైపోయింది. దానర్థం ప్రజల్లో ఎలాంటి రోగాలు ప్రబలడం లేదని కాదు... ఒక్క మహమ్మారికి భయపడి...

Covid-19: ప్రభుత్వాసుపత్రులకు కొత్త పరేషాన్.. ఏంటంటే?
Rajesh Sharma
|

Updated on: Mar 16, 2020 | 4:17 PM

Share

Govt hospitals in Telangana state receiving lesser patients: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య గత కొన్ని రోజులుగా గణనీయంగా తగ్గుతోంది. వందల్లో రోగులొచ్చే ఆసుపత్రులకిపుడు పదుల సంఖ్యలో రోగులు రావడం గగనమైపోయింది. దానర్థం ప్రజల్లో ఎలాంటి రోగాలు ప్రబలడం లేదని కాదు… ఒక్క మహమ్మారికి భయపడి… అక్కడికెళితే ఆ మహమ్మారి తమకెక్కడ తగులు కుంటుందోనన్న భయంతో ప్రభుత్వాసుపత్రులకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. ఇంట్లోనే వుండేందుకు ప్రజలు మొగ్గుచూపుతుండడం విశేషం.

ముందస్తు జాగ్రత్తలు ఎన్ని తీసుకుంటున్నా.. కరోనా మాత్రం వ్యాప్తి చెందుతూనే ఉంది.. ఆ మహమ్మారిని అరికట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం.. అయినా ఇక్కడ కొత్తగా మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడం కాసింత కలవరాన్ని కలిగిస్తోంది. ఇప్పటి వరకు ముగ్గురు పాజిటివ్‌ వ్యక్తులలో ఒకరికి నెగటివ్‌ రావడంతో వారిని డిశ్చార్జ్‌ చేశారు. మిగిలినవాళ్లను ఐసోలేషన్‌ వార్డుల్లో వుంచి చికిత్స అందిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పది రోజుల కిందట నెదర్లాండ్స్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. అతడిలో కరోనా లక్షణాలు గుర్తించి చికిత్స అందిస్తున్నారు. అతడి శాంపుల్స్‌ను పరీక్షల నిమిత్తం పూణె వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. అయితే పరీక్షలు నిర్వహించిన తర్వాత రంగారెడ్డి జిల్లా వాసిలో కరోనా ఉన్నట్టు పూణె వైరాలజీ ప్రయోగశాల స్పష్టం చేసింది. ఇక గాంధీ ఆసుపత్రిలో చేరిన ఇద్దరి నమూనాల్లో వైరస్‌ అనుమానిత లక్షణాలు ఉండటంతో శాంపుల్స్‌ను పూణెకు పంపించారు. రిపోర్ట్స్‌లో సౌదీ అరేబియా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఎయిర్‌హోస్టెస్‌లో వైరస్‌ లేదని నిర్ధారించారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో తొలి కరోనా బాధితుడు దుబాయ్‌ నుంచి వచ్చిన యువకుడు కాగా, మరొక బాధితురాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువతి. తొలి బాధితుడు పూర్తిగా కోలుకుని ఇటీవలే డిశ్చార్జ్‌ కూడా అయ్యాడు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి జిల్లాలకు బాధితులు ఇద్దరూ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా భయంతో గాంధీ , ఫీవర్‌ ఆసుపత్రులకు ఔట్‌ పేషంట్లు తగ్గారు. ఒక్క గాంధీ ఆసుపత్రినే కాదు.. హైదరాబాద్‌లో వున్న ఉస్మానియా తదితర పెద్దాసుపత్రులకు వెళ్ళేందుకు జనం జంకుతున్నారు. అదే సమయంలో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రులకు గతంలో వందల సంఖ్యలో ప్రతీరోజూ జనం వచ్చేవారు. ఈ పెద్దాసుపత్రుల్లోను ప్రస్తుతం జనం తగ్గిపోతుండడం గమనార్హం.