లేహ్ లో కౌన్సిల్ ఎన్నికలు, మూడు పార్టీల మధ్యే ప్రధాన పోటీ
లడాఖ్ అటానమస్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్..లేహ్ లో 26 కౌన్సిల్ సీట్లకు ఈ నెల 22 న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్యే ముక్కోణ పోటీ జరగనుంది.
లడాఖ్ అటానమస్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్..లేహ్ లో 26 కౌన్సిల్ సీట్లకు ఈ నెల 22 న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్యే ముక్కోణ పోటీ జరగనుంది. గత ఏడాది దీన్ని ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన అనంతరం మొదటిసారిగా ఎలెక్షన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ 95 శాతం మంది గిరిజనతెగకు చెందినవారే.. తమకు ఉద్యోగాలు కావాలని వీరిలో చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాన్ని తాము హైలైట్ చేస్తామని ఈ మూడు పార్టీల అభ్యర్థుల్లో ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. ఈ ప్రాంతానికి అసెంబ్లీ, ముఖ్యమంత్రి ఉండాలని కేంద్రాన్ని కోరుతున్నామని, కానీ ఇందుకు చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ అభ్యర్థి, లేహ్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కూడా ఆరోపించారు.