జో బైడెన్ పై న్యాయ పోరాటం కొనసాగుతుంది, డొనాల్డ్ ట్రంప్
డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ పై తన న్యాయపోరాటం కొనసాగుతుందని, కోర్టులో లీగల్ ప్రొసీడింగ్స్ మొదలయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ పై తన న్యాయపోరాటం కొనసాగుతుందని, కోర్టులో లీగల్ ప్రొసీడింగ్స్ మొదలయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో తనకు చాలా ఆధిక్యత లభించిందని, కానీ అదేమిటో ‘మిరాక్యులస్ గా’ అదృశ్యమైందని ఆయన చెప్పారు. ఈ రాష్ట్రాల్లో రాత్రంతా నేను లీడ్ లో ఉన్నట్టు సమాచారం అందింది. కానీ తెల్లారేసరికి ఆ లీడ్ మటుమాయమైంది అని ట్రంప్ వ్యాఖ్యానించారు. బహుశా తన లీగల్ ప్రొసీడింగ్స్ ముందుకు సాగి తనకు అనుకూలంగా ఉత్తర్వులు వస్తే ఆ లీడ్ మళ్ళీ కనిపిస్తుందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. నా ప్రభుత్వం పట్ల అమెరికన్లకు విశ్వాసం ఉండేలా దోహదపడే చట్టంలోని అన్ని అంశాలనూ నేను వినియోగించుకుంటాను అని ట్రంప్ చెప్పారు.