ఏపీ వ్యాప్తంగా భూముల రీ సర్వే, డిసెంబర్ 21 నుంచి ప్రారంభించనున్న సీఎంజగన్
ఏపీ వ్యాప్తంగా భూముల రీసర్వే కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాన్ని డిసెంబరు 21న ప్రారంభించనున్నట్లు..
ఏపీ వ్యాప్తంగా భూముల రీసర్వే కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాన్ని డిసెంబరు 21న ప్రారంభించనున్నట్లు రెవెన్యూ శాఖ వెల్లడించింది. 120 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర భూసర్వే నిర్వహించే భారీ ప్రక్రియకు సంబంధించి జగన్ సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జగన్ తన పాదయాత్ర సమయంలో భూ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత .. భూముల సమగ్ర రీసర్వే, భూ యజమానులకు శాశ్వత భూ హక్కుల కల్పన చట్టం రూపొందించి, బడ్జెట్ లో నిధులు సైతం కేటాయించారు. వచ్చేఏడాది జనవరి 1 నుంచి మొదలుపెట్టాలనుకున్న సర్వేను పది రోజులు ముందుగానే.. అంటే ఈనెల 21 నుంచే ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.