బదిలీలపై ఇకనుంచి ఎటువంటి చార్జీలు లేవు.. స్పష్టం చేసిన ప్రముఖ చెల్లింపుల సంస్థ పేటీఎం..

దేశంలో కరోనా వల్ల డిజిటల్ చెల్లింపులు అధిక మయ్యాయి. దీంతో ఆన్‌లైన్‌లో బిల్లు చెల్లించే యాప్‌లు, వ్యాలెట్‌లు కూడా

బదిలీలపై ఇకనుంచి ఎటువంటి చార్జీలు లేవు.. స్పష్టం చేసిన ప్రముఖ చెల్లింపుల సంస్థ పేటీఎం..
paytm
Follow us

|

Updated on: Dec 02, 2020 | 5:57 AM

దేశంలో కరోనా వల్ల డిజిటల్ చెల్లింపులు అధిక మయ్యాయి. దీంతో ఆన్‌లైన్‌లో బిల్లు చెల్లించే యాప్‌లు, వ్యాలెట్‌లు కూడా ఎక్కువయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో మంచి లాభాలు కూడా సాధించాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్‌‌తో ప్రజలు ఎక్కువగా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా పేటీఎం సంస్థ వ్యాపారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై పేటీఎం వ్యాలెట్, యూపీఐ యాప్స్, రూపే కార్డుల ద్వారా చేసే నగదు బదిలీలపై ఎటువంటి చార్జీలు వసూలు చేయమని స్పష్టం చేసింది.

దీనివల్ల పేటీఎం ఆల్ఇన్‌వన్ క్యూఆర్, పేటీఎం సౌండ్ బాక్స్, పేటీఎం ఆల్ ఇన్‌వన్ ఆండ్రాయిడ్ పీవోఎస్ వాడుతున్న సుమారు 1.7 కోట్ల మంది వ్యాపారులకు లబ్ధి చేకూరుతుందని పేటీఎం ప్రతినిధులు ప్రకటించారు. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన డిజిటిల్ ఇండియా సాకారం చేయడానికి తోడ్పడుతుందని పేటీఎం వైస్ ప్రెసిడెంట్ కుమార్ ఆదిత్య వెల్లడించారు. చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడానికి రూ.600 కోట్లను సంస్థ భరిస్తుందని తెలిపారు. పేమెంట్స్‌ను కూడా డైరెక్ట్‌గా తమ వ్యాలెట్‌కు లేదా బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకునే అవకాశం కూడా కల్పించిందన్నారు. ఇలా వ్యాపారులు చేసే అన్ని రకాల లావాదేవీలపై పేటీఎం మినహాయింపు ఇచ్చింది. దీంతో వినియోగదారులు పేటీఎం వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు