వినూత్న రీతిలో ఎస్కలేటర్‌ ఓపెనింగ్‌

రైతును “రైతుగారు’ అని సంబోధించే రోజు రావాలి..కూలీని కుర్చీలో కూర్చోబెట్టి సన్మానం చేయగల యజమాన్యం ఉండాలి..ఇటువంటి స్లోగన్స్‌ మనం తరచూ వింటుంటాం. కానీ, ఆచరణలో అటువంటి కనిపించటం చాలా అరుదనే చెప్పాలి. అయితే, బెంగళూరు పట్టణంలో చోటు చేసుకున్న ఓ సంఘటన మాత్రం ఇటువంటి ఆదర్శాలకు అద్దం పడుతోంది. కూలీ పనిచేసుకునే వారు ఓ ప్రముఖ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అంతేకాదు, కూలీ కూతురు చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిన అక్కడి అధికారులు అందరి […]

వినూత్న రీతిలో ఎస్కలేటర్‌ ఓపెనింగ్‌
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Nov 12, 2019 | 7:48 PM

రైతును “రైతుగారు’ అని సంబోధించే రోజు రావాలి..కూలీని కుర్చీలో కూర్చోబెట్టి సన్మానం చేయగల యజమాన్యం ఉండాలి..ఇటువంటి స్లోగన్స్‌ మనం తరచూ వింటుంటాం. కానీ, ఆచరణలో అటువంటి కనిపించటం చాలా అరుదనే చెప్పాలి. అయితే, బెంగళూరు పట్టణంలో చోటు చేసుకున్న ఓ సంఘటన మాత్రం ఇటువంటి ఆదర్శాలకు అద్దం పడుతోంది. కూలీ పనిచేసుకునే వారు ఓ ప్రముఖ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అంతేకాదు, కూలీ కూతురు చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిన అక్కడి అధికారులు అందరి ప్రశంసలు, మన్ననలను పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నగరంలోని రైల్వేస్టేషన్‌‌లో ఇటీవల ఎస్కలేటర్‌ ప్రాజెక్టు పనులు పూర్తి చేశారు. దీంతో దాన్ని ప్రారంభించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈనెల 9వ తేదీన ఎంపీ పీసీ మోహన్‌ చేతుల మీదుగా ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అదే రోజు అయోధ్య తీర్పు రావడంతో ఆయన  ఆ కార్యక్రమానికి రాలేకపోయారు. అయితే తాను రాలేకపోయినా కూడా ప్రారంభోత్సవం ఆపవద్దని అధికారులకు సూచించారు. సామాన్యులకు ఉపయోగపడే నిర్మాణం కాబట్టి జాప్యం చేయకూడదని పేర్కొన్నారు.  ఎంపీ చెప్పిన మాటలతో వెంటనే అధికారులు సరికొత్త ఆలోచన చేశారు. సామాన్యుల చేతుల మీదుగానే దీన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ నిర్మాణంలో భాగం పంచుకున్న చాంద్‌బీ అనే మహిళ కూతురు బేగమ్మా చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయించారు. దాని కోసం కష్టపడి పనిచేసిన వారికి ఈ విధంగా గుర్తింపు ఇచ్చినట్టుగా ఉండటంతో పాటు ప్రజలకు ఎస్క్‌లేటర్ అందుబాటులోకి వస్తుందని ఇలా చేశారు.