ఐపీఎల్ 2020: పంజాబ్ ఘన విజయం.. చిత్తుగా ఓడిన బెంగళూరు..
ఐపీఎల్ 2020లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బోణీ కొట్టింది. కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో గెలుపు రుచి చూసింది. దుబాయ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 97 పరుగుల తేడాతో విజయడంకా మోగించింది. ఈ పోరులో పంజాబ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అలరించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ కేఎల్ రాహుల్ […]
ఐపీఎల్ 2020లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బోణీ కొట్టింది. కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో గెలుపు రుచి చూసింది. దుబాయ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 97 పరుగుల తేడాతో విజయడంకా మోగించింది. ఈ పోరులో పంజాబ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అలరించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ కేఎల్ రాహుల్ (69 బంతుల్లో 132; 14 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌట్ అయింది. వాషింగ్టన్ సుందర్ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో అశ్విన్, రవి బిష్నోయి మూడేసి వికెట్లు పడగొట్టగా.. కాట్రేల్ రెండు వికెట్లు.. మాక్స్‌వెల్, షమీ చెరో వికెట్ తీశారు. (IPL 2020)
#KXIP are topping the charts in the Points Table after Match 6.#Dream11IPL #KXIPvRCB pic.twitter.com/T9gcCATZ40
— IndianPremierLeague (@IPL) September 24, 2020
No prizes for guessing who is our Man of the Match for Match 6 of #Dream11IPL.@klrahul11 #KXIPvRCB pic.twitter.com/ugxGioQNPV
— IndianPremierLeague (@IPL) September 24, 2020