AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2020: CSK vs KXIP : గర్జించిన చెన్నై, పంజాబ్‌పై ఏకపక్ష విజయం

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి మరో ఆసక్తికర మ్యాచ్ జరగింది.  చెన్నై సూపర్ కింగ్స్‌, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు నువ్వా-నేనా అంటూ తలపడ్డాయి.

IPL 2020: CSK vs KXIP : గర్జించిన చెన్నై, పంజాబ్‌పై ఏకపక్ష విజయం
Ram Naramaneni
|

Updated on: Oct 04, 2020 | 11:31 PM

Share

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి మరో ఆసక్తికర మ్యాచ్ జరిగింది.  చెన్నై సూపర్ కింగ్స్‌, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు నువ్వా-నేనా అంటూ తలపడ్డాయి. కానీ ఈ మ్యాచ్‌లో చెన్నై ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా సంచలన విజయం సాధించింది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై చెన్నై ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. వరుస ఓటములతో చెన్నై కెప్టెన్ ధోనీతో పాటు చెన్నై టీమ్ పై చాలా విమర్శలు వచ్చాయి. కానీ అవన్నీ ఒక్క మ్యాచ్‌తో సైడయ్యాడు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో చెన్నై ఏకపక్ష ప్రదర్శన చేసింది. చెన్నై  ఓపెనర్లు డుప్లెసిస్‌(87 నాటౌట్: 53 బంతుల్లో 11ఫోర్లు, 1సిక్స్‌) , షేన్‌ వాట్సన్‌(83 నాటౌట్‌ : 53 బంతుల్లో 11ఫోర్లు, 3సిక్సర్లు ) అజేయంగా నిలిచి జట్టుకు అద్బుత విజయాన్ని అందించారు.  పంజాబ్‌ బౌలర్లు ఏ దశలోనూ ఈ ద్వయాన్ని అడ్డుకోలేకపోయారు. పంజాబ్‌ బౌలర్లు తేలిపోవడంతో చెన్నై ఎలాంటి తడబాటుకు గురికాకుండా అవలీలగా విజయాన్ని అందుకుంది.

అంతకుముందు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(63: 52 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్‌), నికోలస్‌ పూరన్‌(33: 17 బంతుల్లో ఫోర్‌, 3సిక్సర్లు) రాణించడంతో పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 రన్స్ చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను రాహుల్‌ ఒంటిచేత్తో నడిపించాడు. మయాంక్‌ అగర్వాల్‌(26), మన్‌దీప్‌ సింగ్‌(27) రాణించారు. చెన్నై బౌలర్లలో శార్దుల్‌ ఠాకూర్‌ రెండు వికెట్లు పడగొట్టగా జడేజా, చావ్లా చెరో వికెట్‌ పడగొట్టారు.

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..