నూతన ఒరవడి : హెచ్ఐవీ పాజిటివ్ జంటలకు పెళ్లిళ్లు
హెచ్ఐవీ ఇదో మహమ్మారి జబ్బు. ఈ వ్యాధి ఉన్నవారిని వివక్షతో చూసిన సందర్బాలు మనం ఇప్పటికీ చూస్తున్నాం. హెచ్ఐవీ సోకినవారు కూడా మనలాంటి మనుషులే.
హెచ్ఐవీ ఇదో మహమ్మారి జబ్బు. ఈ వ్యాధి ఉన్నవారిని వివక్షతో చూసిన సందర్బాలు మనం ఇప్పటికీ చూస్తున్నాం. హెచ్ఐవీ సోకినవారు కూడా మనలాంటి మనుషులే. ఏ వ్యక్తి కావాలని హెచ్ఐవీ బారినపడరు. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాగా తమిళనాడు తూత్తుకుడి జిల్లాలోని ఆనందపురంలో ఉన్న కల్వరీ ఛాపెల్ ట్రస్ట్.. హెచ్ఐవీ బాధితులకు భరోసాను ఇస్తుంది. వారి ఆశలకు అండగా నిలుస్తోంది. వారిని చేరదీసి మంచి విద్య అందిస్తోంది. వారిలో చాలా మంది ఇప్పుడు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అయితే ఇటీవలే మరో అడుగు ముందుకేసింది ట్రస్ట్. హెచ్ఐవీ పాజిటివ్ ప్రేమికులకు ఓ వేడుక నిర్వహించి పెళ్లిళ్లు చేసింది. తూత్తుకుడి జిల్లా కలెక్టర్ సందీప్ నండూరి సమక్షంలో 10 హెచ్ఐవీ పాజిటివ్ జంటలు దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టాయి. ఇలాంటి వేడుక నిర్వహించడం చాలా గొప్ప విషయమని ప్రశంసించారు కలెక్టర్ సందీప్. ట్రస్ట్ సభ్యులను అభినందించారు. అనంతరం హెచ్ఐవీ బాధితులకు అండగా నిలిచిన వారికి అవార్డులు అందించింది ట్రస్ట్.
Also Read :
వాట్సాప్‌లో కొత్తగా అదిరిపోయే ఫీచర్స్