మోహన్‌బాబు ముసుగు తొలగిపోయింది: కుటుంబరావు

మోహన్‌బాబు ముసుగు తొలగిపోయింది: కుటుంబరావు

అమరావతి: ఏపీ రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ కుటుంబరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన సీనియర్ నటులు మోహన్‌బాబుపై విమర్శలు చేశారు. మోహన్ బాబు గారి కాలేజీలో రెడ్డి వర్గం వారిని కాపు వర్గంగా చూపించారని ఆరోపించారు. ఫైళ్లన్నీ తీసుకొస్తే మీ బాకీలన్నీ మిగతా కాలేజీలతో పాటుగా ఇచ్చేయడం జరుగుతుందని చెప్పారు. వాళ్ల స్వార్ధం కోసం పిల్లల భవిష్యత్తును రోడ్డు మీదకు తీసుకొచ్చారని, వాళ్లకు మద్దతుగా ఒక్క కాలేజీ కూడా రాలేదని విమర్శించారు. జగన్‌కు […]

Vijay K

|

Mar 23, 2019 | 1:35 PM

అమరావతి: ఏపీ రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ కుటుంబరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన సీనియర్ నటులు మోహన్‌బాబుపై విమర్శలు చేశారు. మోహన్ బాబు గారి కాలేజీలో రెడ్డి వర్గం వారిని కాపు వర్గంగా చూపించారని ఆరోపించారు. ఫైళ్లన్నీ తీసుకొస్తే మీ బాకీలన్నీ మిగతా కాలేజీలతో పాటుగా ఇచ్చేయడం జరుగుతుందని చెప్పారు.

వాళ్ల స్వార్ధం కోసం పిల్లల భవిష్యత్తును రోడ్డు మీదకు తీసుకొచ్చారని, వాళ్లకు మద్దతుగా ఒక్క కాలేజీ కూడా రాలేదని విమర్శించారు. జగన్‌కు మోహన్‌ బాబు ఒకాల్తా పుచ్చుకున్నారని ఆరోపించారు. ముసుగు తీసేయండి, వైసీపీకే ప్రచారం చేస్తానంటే చేయండి. కానీ వాస్తవాలను వక్రీకరించి ప్రజలను మాయ చేయొద్దని కుటుంబరావు అన్నారు.

మంచు ఫ్యామిలి అంటే ఏమిటనేది ప్రజలు అర్ధం చేసుకోవాలని ఆయన చెప్పారు. రూ. 95 కోట్లు మీ కిట్టీలో వేసుకుని, అందులో కోటి రూపాయల పైచీలకు బాకీ ఉంటే కహానీ చెబుతున్నారని, మీ క్రెడిబులిటీ ఎంతో చూసుకోవాలని అన్నారు. సంస్థను నడుపుతున్నారా, వ్యాపారం చేస్తున్నారా అని కుటుంబరావు ప్రశ్నించారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu