AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీపీసీసీ వర్కింగ్ రేసులో మాజీ మంత్రి కొండా సురేఖ? పార్టీ వీడిన సీనియర్ నేతలకు ధీటుగా..

జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతో ఇబ్బందిపడుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఎందుకంటే గత ఐదేళ్లలో జరిగిన ఎన్నికల ఫలితాలను

టీపీసీసీ వర్కింగ్ రేసులో మాజీ మంత్రి కొండా సురేఖ? పార్టీ వీడిన సీనియర్ నేతలకు ధీటుగా..
uppula Raju
|

Updated on: Dec 27, 2020 | 7:28 AM

Share

జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతో ఇబ్బందిపడుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఎందుకంటే గత ఐదేళ్లలో జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తే సరిపోతుంది. అయితే అధిష్ఠానం దీనికి పుల్ స్టాప్ పెట్టాలని భావిస్తోంది. అందుకోసం ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పార్టీ సీనియర్ శ్రేణులతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తెలంగాణలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాభవానికి బాధ్యతగా పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకుడిగా ఎవరు నియమితులవుతారో అని తెలంగాణలో చర్చ మొదలైంది.

ఇదిలా ఉంటే పీసీసీ ఛీప్ రేసులో ఇప్పుడు మాజీ మంత్రి, మహిళా నాయకురాలు కొండా సురేఖ పేరు వినిపిస్తోంది. అయితే పార్టీ అధిష్ఠానం మహిళా నాయకత్వానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. ఎందుకంటే ఇంతకు ముందు పార్టీలో ఉన్న సీనియర్ నేతలు డీ.కె.అరుణ, విజయశాంతిలు బీజేపీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అందుకే పార్టీలో వారికి ధీటుగా మహిళలకు పెద్ద పీట వేయాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. అంతేకాకుండా కొండా సురేఖకు రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన బీసీ సామాజిక వర్గాల్లో మంచి సంబంధాలు, మంత్రిగా పనిచేసిన అనుభవం, మంచి వాక్చాతుర్యం లాంటివి అనుకూలంగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే, ఆదివాసీ నాయకురాలు సీతక్కకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగించడంతో పాటు కీలక కమిటీల్లో ఆమె పేరు చేరుస్తారనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. గిరిజన సామాజిక వర్గానికి చెందిన సీతక్క రెండోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే మహిళా కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు.

Follow Us
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!