రెండు వారాల క్రితమే కోడెల ఆత్మహత్యకు యత్నించారా?
తెలుగుదేశం పార్టీ అగ్రనేత కోడెల శివప్రసాదరావు కన్నుమూత.. బలవన్మరణమే అని నిర్థరణ అయ్యింది. తొలుత.. ఆయన తీవ్ర గుండెపోటుతో చనిపోయారని వార్తలు వచ్చినా.. వైద్యులు పరీక్షించిన అనంతరం కోడెల బలవంతంగా ప్రాణం విడిచారన్న వార్త.. నిర్థరణకు వచ్చింది. హైదరాబాద్ లోని తన స్వగృహంలో ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. కొన్నాళ్లుగా తీవ్ర మనస్తాపంతో ఉన్న కారణంగానే.. కోడెల ఇంతటి నిర్ణయానికి తెగించి ఉండవచ్చన్న అభిప్రాయం అనుచరుల్లో వ్యక్తమవుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కాగా […]
తెలుగుదేశం పార్టీ అగ్రనేత కోడెల శివప్రసాదరావు కన్నుమూత.. బలవన్మరణమే అని నిర్థరణ అయ్యింది. తొలుత.. ఆయన తీవ్ర గుండెపోటుతో చనిపోయారని వార్తలు వచ్చినా.. వైద్యులు పరీక్షించిన అనంతరం కోడెల బలవంతంగా ప్రాణం విడిచారన్న వార్త.. నిర్థరణకు వచ్చింది. హైదరాబాద్ లోని తన స్వగృహంలో ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. కొన్నాళ్లుగా తీవ్ర మనస్తాపంతో ఉన్న కారణంగానే.. కోడెల ఇంతటి నిర్ణయానికి తెగించి ఉండవచ్చన్న అభిప్రాయం అనుచరుల్లో వ్యక్తమవుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
కాగా కోడెల మరణంతో టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతికి లోనయ్యాయి. ఆయన ఎలా చనిపోయారనే అంశంపై పోస్టుమార్టం తరువాతే స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలతో కోడెల శివప్రసాదరావు తీవ్ర ఆవేదనకు లోనయినట్టు సమాచారం. కుమారుడితో కూడా కొన్ని విభేదాలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే రెండు వారాల కిందటే ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే అప్పట్లో కుటుంబసభ్యులు సకాలంలో గుర్తించడంతో కోడెలకు ముప్పు తప్పిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. పల్నాడు పులి ఒకప్పుడు ఎంతో గౌరవంగా పులిలా బతికిన తాను, తలవంపులు తట్టుకోలేకపోతున్నానని కోడెల తన సన్నిహితుల దగ్గర వాపోయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు.