Somvati Amavasya: సోమవతి అమావాస్య అంటే ఏమిటీ ?.. ఆ రోజూ పూర్వీకులను పూజించడం వలన కలిగే ఫలితాలెంటీ ?
హిందూ క్యాలెండర్ ప్రకారం 2021 సంవత్సరంలో 12 అమావాస్యలు ఉన్నాయి. హిందూలకు అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున
హిందూ క్యాలెండర్ ప్రకారం 2021 సంవత్సరంలో 12 అమావాస్యలు ఉన్నాయి. హిందూలకు అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున దేవుళ్లకు పూజ చేయడం మరియు ఉపవాసం ఉండడం వలన మంచి జరుగుతుంది అనే నమ్మకం. ఇక ప్రత్యేకంగా చేసే పూజలు, వ్రతాలకు అమవాస్య రోజు చాలా మంచిది అని భావిస్తారు. అలాగే అమవాస్య రోజు పూర్వీకులను పూజించడం కూడా ఆనవాయితీగా వస్తుంది.
జాతకంలో పితృ దోషం ఉన్నవారు, ఈ రోజున పూజలు చేయాలని చెబుతుంటారు పండితులు. అలాగే అమావాస్య రోజు పూర్వీకులను ఆరాధించడం వారి ఆశీర్వాదాలను పొందవచ్చని… వారి ఆశీర్వాదాలతో జీవితం, డబ్బు, ఉద్యోగం మరియు వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలను సులువుగా పరిష్కారించబడతాయి అంటారు.
సోమవతి అమావాస్య ఎప్పుడు?
సోమవతి అమవాస్య 2021 సంవత్సరంలో ఏప్రిల్12న వచ్చింది. దీనిని చైత్ర అమావాస్య అని కూడా అంటారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం సోమవతి అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం చేయడం అనేది ముఖ్యమైన విధి. అలాగే ఈ రోజున వారి తల్లితండ్రులను పూజించడం ద్వారా ఇంట్లో ఆనంద క్షణాలు కలుగుతాయని నమ్మకం.
సోమవతి అమావాస్య రోజున చేయకూడని పనులు..
సోమవతి అమవాస్య రోజున నదిలో స్నానం చేసిన తరువాత తమ పూర్వీకులను పూజించాలి. ఆ తర్వాత పేదవారికి ధానం చేయడం. ఆ రోజున ఎవరిని కించపరవద్దు. జీవ హింస చేయకూడదు. అలాగే కోపాన్ని నియంత్రించుకోవడం.. ఎదుటి వారితో మాట్లడేటప్పుడు సున్నితంగా మాట్లాడాలి.
సోమవతి అమావాస్య రోజుల పూర్వీకులను పూజించడం..
సోమవతి అమావాస్య రోజున పూర్వీకులను పూజించాలి. ఆరోజు పెద్దలకు చాలా ఇష్టమైన రోజూ అని.. అంతేకాకుండా వారికి మీ పట్ల ఉన్న కోపాన్ని తోలగించుకుంటారని ప్రతీతి. పూర్వీకుల కోపానికి గురైతే మీ జీవితంలో ఉద్యోగావకాశాలు కోల్పోవడం. వ్యాపారంలో నష్టం రావడం. ఇంట్లో సమస్యలు ఎదురవడం.. పెద్దలు గౌరవడం కోల్పోవడం వంటివి జరుగుతాయిని భావిస్తారు. సోమవతి అమావాస్య రోజున పూర్వీకులను పూజించడం వలన మంచి జరుగుతుందని చాలా వరకు నమ్ముతారు.
Also Read: నేటి అమావాస్యకి ఓ ప్రత్యేకత ఉంది.. కోటి సూర్య గ్రహణములతో సమానమైన సోమావతి అమావాస్య.. ఇలా చేయండి..
అమావాస్య రోజున వచ్చే పున్నమి దీపావళి.. ఉత్తర భారతీయులకు అయిదురోజుల పండుగ.. మనకు మూడు రోజులు..