అమావాస్య రోజున వచ్చే పున్నమి దీపావళి.. ఉత్తర భారతీయులకు అయిదురోజుల పండుగ.. మనకు మూడు రోజులు..

పరబ్రహ్మ స్వరూపమే దీపం. మనో వికాసానికి, ఆనందానికి, సుఖశాంతులకు, సద్గుణానికి ప్రతీక దీపం. ఆ జ్యోతి మనలోని అజ్ఞానాన్ని రూపుమాపుతుంది. దీపావళి పండుగ పరామర్థమిదే!

అమావాస్య రోజున వచ్చే పున్నమి దీపావళి.. ఉత్తర భారతీయులకు అయిదురోజుల పండుగ.. మనకు మూడు రోజులు..
Follow us

|

Updated on: Nov 13, 2020 | 1:37 PM

దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్‌ దీపేన సాధ్యతే సర్వమ్‌ సంధ్యా దీప నమోస్తుతే

దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపేన హరతే పాపం సంధ్యా దీప నమోస్తేతే

పరబ్రహ్మ స్వరూపమే దీపం. మనో వికాసానికి, ఆనందానికి, సుఖశాంతులకు, సద్గుణానికి ప్రతీక దీపం. ఆ జ్యోతి మనలోని అజ్ఞానాన్ని రూపుమాపుతుంది. దీపావళి పండుగ పరామర్థమిదే! ఇంటింటా కళ్లు మిరుమిట్లుగొలిపే దీపకాంతులు బారులు తీరేది అందుకే. చీకటి అజ్ఞానానికి సంకేతం. వెలుగు జ్ఞానానికి చిహ్నం. దీపం చిన్నదైనా చుట్టుపక్కంతా వెలుగును నింపుతుంది. అది కళ్లకు మాత్రమే కనిపించే కాంతికాదు. మనుసును నింపే జ్ఞానకాంతి. దీపావళి అంటే దీపాల వరుస. మనలోని అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి జ్ఞానకాంతులను విరజిమ్మే పండుగ. దేశమంతా ఆనందోత్సవాలతో జరుపుకునే పండుగ. చిమ్మచీకట్లను కురిపించే అమావాస్య రాత్రిని పిండారబోసినట్లనిపించే వెన్నెల వెలుతుళ్లతో నింపేసే పండుగ. కుల మతాలకు అతీతంగా, వర్గ వయోభేదాలు లేకుండా అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ. అది నవ్యకాంతుల నేత్రావళి. దివ్వ జ్యోతుల దీపావళి. దీపావళికి యుగయుగాల చరిత్ర వుంది. యుగానికో కథ వుంది. దీపావళి రోజే మహాభక్తుడు, దానగుణ సంపన్నుడు అయిన బలిచక్రవర్తిని వామనావతారంలోని మహా విష్ణువు పాతాళంలోకి పంపించాడు. దీపావళి రోజే శ్రీరామచంద్రుడు రావణాసురుడిని సంహరించాడు. నరకాసురుడిని సత్యభామాదేవి హతమార్చింది కూడా దీపావళి రోజే. ఇదే రోజు విక్రమార్కుడు శత్రు సంహారాన్నిగావించి తన పేరిట శకమును నిలుపుకున్నాడు. అందుకే ఈ పండుగను సర్వ జనులు సంబరంగా జరుపుకుంటారు..పండుగ ప్రాశస్త్యం ఎలా వున్నా… పండుగకు సంబంధించిన పురాణగాధలు ఎన్ని వున్నా…ఇది మాత్రం దీపాల పండుగే. అన్నట్టు ఇదే రోజు మహావీరుడు నిర్యాణం చెందాడు.

దక్షిణ భారతీయులు ఈ పండుగను మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అశ్వీయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. తర్వాత అమావాస్య రోజును దీపావళిగా జరుపుకుంటారు.. ఆ మరుసటి రోజు కార్తీక శుద్ధ పాడ్యమి కూడా పండుగే! అదే ఉత్తర భారతంలో అయితే అయిదు రోజులపాటు పండుగ చేసుకుంటారు. ఆశ్వీయుజ బహుళ త్రయోదశి నుంచి మొదలయ్యే పండుగ సందడి విదియ వరకు కొనసాగుతుంది. ఉత్తర భారత ప్రజలు ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, భగినీహస్త భోజనం అన్న పేర్లతో అయిదు రోజులూ పండుగ వేడుకలను జరుపుకుంటారు. త్రయోదశి రోజు సాంధ్య సమయాన అపమృత్యు నివారణ కోసం నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి..దాన్ని పూజించి ఇంటి ముందుంచుతారు. చతుర్దశి, అమావాస్య రోజుల్లో ప్రదోష వేళ దీపదానాన్ని చేస్తారు. తద్వారా యమ మార్గాధికారం నుంచి బయటపడతారు.

నరక చతుర్దశి రోజున యమునికి తర్పణాన్ని ఆచరించి, దీపదానం చేస్తే పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయని ఓ విశ్వాసం…నరకచతుర్ధశి రోజున నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి వుంటారు. అందుకే నువ్వుల నూనెతో తలంటుకొని సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానమాచరించి, కొత్త బట్టలు ధరించి ఉత్తరేణి ఆకులు, మట్టిపెళ్లలతో దిష్టి తీయించుకుంటారు. ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొందరు ఆచరిస్తారు. మినప ఆకులను వండుకొని తినడమనే సంప్రదాయాన్ని కూడా కొంత మంది పాటిస్తారు. అమావాస్య నాడు వచ్చే పున్నమిరేయి దీపావళి. ఈ రోజున మర్రి, మామిడి, అత్తి, జవ్వి, నేరేడు చెట్ల బెరడులను నీటలో వేసి ఆ నీటితో స్నానం చేయడం కూడా ఓ ఆచారం. ప్రదోష కాలాల్లో దీపాలను వెలిగించి, ఆ తర్వాత దరిద్రాన్ని పారదోలేందుకు, ధన కనక వస్తు వాహనాలు లభించేందుకు లక్ష్మీపూజ చేస్తారు. కొంత మంది పితృదేవతారాధన కూడా చేస్తారు.

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!