ఏపీ రాజధాని మార్పు పై.. కిషన్ రెడ్డి ఏమన్నారంటే..!
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ రాజధాని విషయంలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఈ విషయం పై కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాజధాని మార్పు పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని ఆయన చెప్పారు. అలాగే హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అంటూ వస్తున్న వార్తలో వాస్తవం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ సనత్‌నగర్ ఈఎస్‌ఐసీలో రూ. 150 కోట్లతో కొత్త బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన […]
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ రాజధాని విషయంలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఈ విషయం పై కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాజధాని మార్పు పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని ఆయన చెప్పారు. అలాగే హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అంటూ వస్తున్న వార్తలో వాస్తవం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ సనత్‌నగర్ ఈఎస్‌ఐసీలో రూ. 150 కోట్లతో కొత్త బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇక నడ్డా ఎవరో తెలియదని కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. జేపీ నడ్డా ఎవరో తెలియదనడం మంచి సంస్కృతి కాదన్నారు. ఇది కేటీఆర్ అహంకారానికి నిదర్శనమని కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ లేకపోతే కవిత ఎలా ఓడిపోయారని ఆయన ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలవటం తమ పార్టీ లక్ష్యం కాదని.. 2023లో తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.