ట్రాఫిక్ రూల్స్: హెల్మెట్ పెట్టుకోలేదని సీఎంకే ఫైన్..!!
ట్రాఫిక్ రూల్స్.. ఈ మాట వింటే.. అందరికీ గుండె గుభేలమంటోంది. కొత్త మోటార్ వెహికల్ చట్టం వచ్చిన తర్వాత ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినమయ్యాయి. దీంతో.. ఏముందిలే.. అనుకుని బయటకి వెళ్లేవారి జేబులకి చిల్లు పడుతోంది. ఆ బిల్లులు కట్టలేక.. దాదాపు ఇప్పుడు చాలా మంది తప్పక రూల్స్‌ని పాటిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ ఎందుకు ట్రాఫిక్ రూల్స్ గురించి ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని.. ఏకంగా సీఎంకే.. ఫైన్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటన […]
ట్రాఫిక్ రూల్స్.. ఈ మాట వింటే.. అందరికీ గుండె గుభేలమంటోంది. కొత్త మోటార్ వెహికల్ చట్టం వచ్చిన తర్వాత ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినమయ్యాయి. దీంతో.. ఏముందిలే.. అనుకుని బయటకి వెళ్లేవారి జేబులకి చిల్లు పడుతోంది. ఆ బిల్లులు కట్టలేక.. దాదాపు ఇప్పుడు చాలా మంది తప్పక రూల్స్‌ని పాటిస్తున్నారు.
ఇప్పుడు మళ్లీ ఎందుకు ట్రాఫిక్ రూల్స్ గురించి ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని.. ఏకంగా సీఎంకే.. ఫైన్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటన పుదుచ్ఛేరిలో జరిగింది. తాజాగా.. జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో హెల్మెట్ లేకుండా స్కూటర్‌ను నడిపారు పుదుచ్ఛేరి సీఎం నారాయణ స్వామి. అయితే.. ఈ ఫొటో కాస్త వైరల్‌గా మారింది. దీంతో.. కొంతమంది సోషల్ మీడియాలో.. రూల్స్ సామాన్యులకేనా..? సీఎంకు వర్తించవా..? అంటూ నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు.
ఇక ఈ విషయంపై జోక్యం చేసుకున్న పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ.. తప్పక సీఎం దగ్గర నుంచి జరిమనా వసూలు చేయాల్సిందిగా డీజీపీని ఆదేశించారు. ఈ విషయంపై.. సోషల్ మీడియా వేదికగా.. సీఎం నారాయణ స్వామి, కిరణ్ బేడీల మధ్య ట్విట్టర్ వార్ నడిచింది. సీఎం నారాయణ స్వామి, కాంగ్రెస్ నేతలు హెల్మెట్ లేకుండా.. డ్రైవ్ చేసిన ఫొటోను షేర్ చేసి.. నిబంధనల ప్రకారం మీరు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. వీరు కూడా.. జరిమానాలు కట్టాల్సిందే అంటూ.. కిరణ్‌బేడీ ట్వీట్ చేశారు.
దీనికి స్పందించిన సీఎం.. కిరణ్ బేడీ.. ఉన్న రెండు ఫొటోలను ట్వీట్టర్‌లో షేర్ చేస్తూ.. మీరు బోధించే ముందు.. ప్రాక్టీస్ చేయండి అంటూ.. ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఒక ఫొటోలో కిరణ్ బేడి తలపై దుప్పటా కప్పుకుని బండిపై వెళ్తున్నారు. మరొకటి బండిపై వెనుక ఉన్నది. దీంతో.. వీరిద్దరి మధ్య తారాస్థాయిలో ట్వీట్స్ వార్ జరిగింది.
This time Mr CM you and your accomplices shall pay the penalty for making a mockery of the law. And Directions of the Honbl Supreme Court and the Madras High Court. Enough is enough. You have been obstructing them from carrying out their duties. No More..@PMOIndia @AmitShah @ANI pic.twitter.com/a4hkbH0Nvv
— Kiran Bedi (@thekiranbedi) October 20, 2019
The CM of Puducherry has been obstructing the law and also violating the law. Its caused several fatal and injury accidents because of this. It’s time the judiciary holds such obstructionists to account. pic.twitter.com/ylCBPyt45t
— Kiran Bedi (@thekiranbedi) October 20, 2019