కేర‌ళలో భారీ వ‌ర్షాలు.. ఆ మూడు జిల్లాల్లో రెడ్ అల‌ర్ట్‌!

గత కొద్ధి రోజులుగా కేర‌ళలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. కొండవాలు ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎడ‌తెర‌పిలేకుండా కురుస్తున్న వ‌ర్షాలతో ప‌లు ప్రాంతాలు నీట మునిగాయి.

కేర‌ళలో భారీ వ‌ర్షాలు.. ఆ మూడు జిల్లాల్లో రెడ్ అల‌ర్ట్‌!
Follow us

| Edited By:

Updated on: Aug 07, 2020 | 2:44 PM

Kerala rains: గత కొద్ధి రోజులుగా కేర‌ళలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. కొండవాలు ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎడ‌తెర‌పిలేకుండా కురుస్తున్న వ‌ర్షాలతో ప‌లు ప్రాంతాలు నీట మునిగాయి. నీటి ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేసి, నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. దీంతో కేర‌ళ వాతావ‌ర‌ణ కేంద్రం ఇడుక్కి, మ‌లప్పురం, వయ‌నాడ్ జిల్లాలకు ఆగ‌స్టు 11 వ‌ర‌కు రెడ్ అల‌ర్ట్ జారీచేసింది.

కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యలను చేపడుతోంది. కోజికోడ్‌, క‌న్నూరు, ఎర్నాకుళం, త్రిసూర్‌, పాల‌క్కాడ్‌, కాస‌ర్‌గో‌డ్ జిల్లాల‌కు కేర‌ళ వాతావ‌ర‌ణ కేంద్రం ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసింది. భారీ వ‌ర్షాల కార‌ణంగా పెరియార్ న‌ది ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్న‌ది. దీంతో అలువాలోని శివాలయం నీట మునిగింది. ఇడుక్కి జిల్లాలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఆ కొండ‌చ‌రియల కింద దాదాపు 80 మంది చిక్కుకుని ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు ఐదు మృత‌దేహాల‌ను వెలికితీశారు.

[svt-event date=”07/08/2020,2:26PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event date=”07/08/2020,2:27PM” class=”svt-cd-green” ]

[/svt-event]