చాన్నాళ్ళ తర్వాత తెలంగాణ భవన్‌కు కేసీఆర్.. వచ్చింది ఇందుకే

చాలా రోజుల తర్వాత గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ అధికార కార్యాలయం తెలంగాణ భవన్‌కు వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం హఠాత్తుగా ఆయన తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. రాకరాక రారాజు వస్తే ఎలా వుంటుందో అలాగే గులాబీ శ్రేణులు కేసీఆర్ రాకతో ఉత్సాహపడ్డారు. మరి ఇంతకూ కేసీఆర్ సడన్ రాకకు కారణమేంటి? తెలంగాణ భవన్ నిర్మించిన తర్వాత కేసీఆర్ ఎక్కువ సమయంలో అక్కడే గడిపేవారు. మధ్యాహ్న సమయంలో తెలంగాణ భవన్ వచ్చే కేసీఆర్.. అర్ధరాత్రి దాటిన తర్వాత […]

చాన్నాళ్ళ తర్వాత తెలంగాణ భవన్‌కు కేసీఆర్.. వచ్చింది ఇందుకే
Follow us
Rajesh Sharma

|

Updated on: Dec 31, 2019 | 5:43 PM

చాలా రోజుల తర్వాత గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ అధికార కార్యాలయం తెలంగాణ భవన్‌కు వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం హఠాత్తుగా ఆయన తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. రాకరాక రారాజు వస్తే ఎలా వుంటుందో అలాగే గులాబీ శ్రేణులు కేసీఆర్ రాకతో ఉత్సాహపడ్డారు. మరి ఇంతకూ కేసీఆర్ సడన్ రాకకు కారణమేంటి?

తెలంగాణ భవన్ నిర్మించిన తర్వాత కేసీఆర్ ఎక్కువ సమయంలో అక్కడే గడిపేవారు. మధ్యాహ్న సమయంలో తెలంగాణ భవన్ వచ్చే కేసీఆర్.. అర్ధరాత్రి దాటిన తర్వాత గానీ ఇంటికెళ్ళే వారు కాదని పార్టీ ఆఫీసు వర్గాలు చెప్పుకుంటాయి. అయితే, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ భవన్‌కు ముఖ్యమైన కార్యక్రమాల సమయంలో మాత్రమే రావడం మొదలైంది. ఏడాది క్రితం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తనయుడు కేటీఆర్‌ను నియమించిన తర్వాత తెలంగాణ భవన్‌కు కేసీఆర్ రాక మరీ తక్కువైపోయింది. ఈ క్రమరంలో ఆయన మంగళవారం సడన్‌గా ఎలాంటి ప్రత్యేక కార్యక్రమం లేకున్నా వచ్చేశారు.

కేసీఆర్ తన ఆస్థాన వాస్తు సిద్దాంతితో కలిసి తెలంగాణ భవన్‌కు వచ్చారు. పార్టీ కార్యాలయంలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై భవనంలో తిరిగారు ముఖ్యమంత్రి. నూతనంగా నిర్మించిన క్యాంటీన్‌ను పరిశీలించారు. త్వరలో భవన్‌లో సిద్దాంతి చెప్పిన మార్పులకు సంబంధించిన పనులు ప్రారంభించాలని కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు కేసీఆర్. ఆ తర్వాత తెలంగాణభవన్ నుంచి నేరుగా ప్రగతి భవన్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.