KCR on CAA: నాలాంటి వారికి బర్త్ సర్టిఫికేట్ ఎక్కడిది? సీఏఏపై కేసీఆర్
పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ సోమవారం తీర్మానించింది. తీర్మానంపై సుదీర్ఘంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పౌరసత్వ చట్ట సవరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నామో కూలంకషంగా వివరించారు.

KCR interesting comments on Citizenship Amendment Act (CAA): పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ సోమవారం తీర్మానించింది. తీర్మానంపై సుదీర్ఘంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పౌరసత్వ చట్ట సవరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నామో కూలంకషంగా వివరించారు. దేశంలోని కోట్లాది మందిని ఇబ్బందులకు గురి చేసే ఈ చట్టసవరణ అంతర్జాతీయంగా కూడా దేశ ప్రతిష్టను మంట గలుపుతోందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అందుకే సీఏఏను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. దేశంలో చాలా మంది పేదలకు బర్ద్ సర్టిఫికేట్ లేదని, తనకూ బర్త్ సర్టిఫికేట్ లేదని ఆయన అన్నారు.
కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను ఆయన మాటల్లోనే.. ‘‘ జాతీయ పౌరసత్వంపై గత కొద్ది రోజులుగా అనేక వర్గాలు వారి వారి పద్ధతుల్లో నిరసనలు చేశారు.. ఇప్పటికే పార్లమెంట్‌లో మన నిర్ణయం చెప్పాం.. దేశంలోని ఏడు రాష్ట్రాలు సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశాయి. దేశ వ్యాప్తంగా దీన్ని వ్యతిరేకించారు.. దీన్ని పునః సమీక్షించమని చెప్పారు.. అందుకే సీఏఏను వ్యతిరేకిస్తూ సభలో తీర్మానం పెట్టాను .. సీఏఏ బిల్లు తీవ్ర ఆందోళన సృష్టిస్తోంది.. గుడ్డిగా మేము సీఏఏను వ్యతిరేకించడం లేదు.. అన్ని అర్థం చేసుకొని పూర్తిగా ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నాం.. ’’ అంటూ ప్రసంగించారుు ముఖ్యమంత్రి కేసీఆర్.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఢిల్లీ పర్యటన సందర్భంగా అదే నగరంలో అనేక మంది చనిపోయారని, కేంద్ర నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ దేశానికి కొత్తగా సీఏఏ చట్టం అవసరం లేదని, రాక్షసానందం పొందుతూ ఈ ఆక్ట్ అమలు చేయనవసరం లేదని ఆయనన్నారు. ఏదో కొంపలు మునిగినట్టు ఇదొక్కటే సమస్య అన్నట్టుగా కేంద్ర ప్రవర్తిస్తుందని, ఇది హిందు ముస్లిం సమస్య కాదు దేశ సమస్య అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. దేశంలో కోట్ల మంది పేదలకు బర్త్ సర్టిఫికెట్ లేదు.. అందులో తాను ఒకడినని.. తమలాంటి వారి పరిస్థితి ఏంటనే విషయంపై కేంద్రం సమాధానం చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.




