హైదరాబాద్ కార్వీకి ఏమైంది ? ఇన్వెస్టర్లలో ఆందోళన..

హైదరాబాద్ లోని కార్వీ ఒక్కసారిగా లిక్విడిటీ క్రంచ్ ( సంక్షోభ దిశ) ను ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. ఆముదం విత్తనాల కాంట్రాక్టుల్లో కమోడిటీ ట్రేడింగ్ క్లయింట్లు చెల్లింపులు జరపలేక చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. ఇన్వెస్టర్లు సోషల్ మీడియా వేదికగా ఏకంగా ప్రధాన మంత్రి కార్యాలయానికి, ఆర్ధిక మంత్రిత్వ శాఖకు, సెబీకి ఎస్ ఓ ఎస్ మెసేజ్ లు పంపడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ చెల్లింపుల సమస్య మరింత ‘ విషమించి ‘ ఇతర ఇన్వెస్టర్లు కూడా కార్వీ […]

హైదరాబాద్ కార్వీకి ఏమైంది ? ఇన్వెస్టర్లలో ఆందోళన..
Follow us
Anil kumar poka

|

Updated on: Nov 18, 2019 | 11:34 AM

హైదరాబాద్ లోని కార్వీ ఒక్కసారిగా లిక్విడిటీ క్రంచ్ ( సంక్షోభ దిశ) ను ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. ఆముదం విత్తనాల కాంట్రాక్టుల్లో కమోడిటీ ట్రేడింగ్ క్లయింట్లు చెల్లింపులు జరపలేక చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. ఇన్వెస్టర్లు సోషల్ మీడియా వేదికగా ఏకంగా ప్రధాన మంత్రి కార్యాలయానికి, ఆర్ధిక మంత్రిత్వ శాఖకు, సెబీకి ఎస్ ఓ ఎస్ మెసేజ్ లు పంపడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ చెల్లింపుల సమస్య మరింత ‘ విషమించి ‘ ఇతర ఇన్వెస్టర్లు కూడా కార్వీ తమకు పే మెంట్లు చేయడంలేదంటూ ఫిర్యాదులు చేస్తున్నట్టు సమాచారం. తన ట్రేడింగ్ ఖాతా నుంచి ప్రస్తుతమున్న సొమ్మును తన అకౌంటుకు బదిలీ చేయాలంటూ ఎన్నిసార్లు కోరినా సర్వర్ సమస్య ఉందంటూ జాప్యం చేస్తున్నారని దీపక్ ముంద్రా అనే ఇన్వెస్టర్ ట్వీట్ చేశారు. ఇలాగే బిందియాషా, ఎం కె ఆర్, గీతేష్, సతీష్ పవార్ వంటి పలువురు ఇన్వెస్టర్లు ట్వీట్లు చేశారు. అయితే చాలా వరకు ‘ ఇష్యు ‘ లను పరిష్కరిస్తున్నామని కార్వీ కూడా ట్వీట్ చేసింది. పైగా ఎవరికైనా సమస్యలుంటే వారు 040.. 33216400 అనే నెంబరును కాంటాక్ట్ చేయాలని సూచించింది. మరోవైపు మార్కెట్ పై ఎలాంటి తీవ్ర ప్రభావం లేకుండా చూసేందుకు సెబీ ఈ అంశాన్ని సున్నితంగా పరిష్కరించేందుకు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి కార్వీ క్లయింట్ల ‘ పే అప్ ‘ తో నిమిత్తం లేకుండా ఈ బ్రోకింగ్ సంస్థ చెల్లింపులు జరపవలసిందే. ప్రతి సంస్థకూ క్లియరింగ్ కార్పొరేషన్ వద్ద డిపాజిట్ల రూపంలో ఫండ్స్ ఉంటాయని, తన క్లయింట్ల నుంచి బ్రోకింగ్ సంస్థ ఫండ్స్ ను సేకరించలేకపోయి.. ఔట్ స్టాండింగ్ ట్రేడ్స్ ని సెటిల్ చేయలేకపోయిన పక్షంలో..ఈ కార్పొరేషన్ బ్రోకింగ్ సంస్థ డిపాజిట్ చేసిన నిధులను డిడక్ట్ చేసి దాన్ని ఇతరులకు చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు.

లిక్విడిటీ క్రంచ్ కారణంగా కార్వీకి చెందిన ఇతర కస్టమర్లు పది రోజులైనప్పటికీ చెల్లింపులు అందుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈ సంస్థ ఉద్యోగుల జీతాలకు కూడా ఇబ్బంది ఏర్పడినట్టు తెలిసింది. అయితే దీపావళి సెలవుల కారణంగా చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని కార్వీ అధికారి ఒకరు ‘ మనీ కంట్రోల్ ‘ కు ఫోన్ ద్వారా తెలిపారు. లిక్విడిటీ క్రంచ్ సంక్షోభంలో తమ సంస్థ లేదని, సిబ్బందికి వేతనాల చెల్లింపుల్లో ఆలస్యం జరగడంలేదని చెప్పారు. స్టాక్ ఎక్స్ చేంజ్ రెగ్యులేషన్స్ ప్రకారం బకాయిలనన్నీ క్లియర్ చేస్తున్నామని ఆయన అన్నారు. అయితే మరో ఇన్వెస్టర్ 10 రోజులైనప్పటికీ తనకు సొమ్ము రాలేదని, తన లెడ్జర్ లో ఉన్నట్టు చూపుతున్నా యాక్సెస్ కాలేకపోతున్నానని ‘ భోరు ‘ మన్నారు. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది తమ ఫండ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి సెబీ గానీ ప్రధాన మంత్రి కార్యాలయం లేదా ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. కార్వీ నిజంగా సంక్షోభంలో ఉందా అన్నది కూడా త్వరలో తేలనుంది. https://twitter.com/DipakMundra/status/1193577488540061696