గోధ్రా వంటి పరిస్థితి తలెత్తవచ్చు.. కర్నాటక మంత్రి సంచలన వ్యాఖ్య

సవరించిన పౌరసత్వ చట్టంపై ఓ వైపు దేశంలో నిరసనలు పెల్లుబుకుతుండగా.. మరోవైపు కర్నాటక మంత్రి సీ. టి. రవి వివాదాస్పద వ్యాఖ్య చేశారు. మెజారిటీ ప్రజల (హిందువుల) సహనాన్ని పరీక్షించవద్దని, ఒకప్పుడు గుజరాత్ లోని గోధ్రాలో ఏం జరిగిందో ఓ సారి గుర్తు తెచ్చుకోవాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేత యు.టి. ఖాదర్ ఇటీవల చేసిన ఓ వ్యాఖ్యకు కౌంటర్ గా రవి ఇలా తీవ్రంగా స్పందించారు. గోధ్రాలో కొంతమంది తమ మానసిక దౌర్బల్యంతో రైలుకు నిప్పు […]

గోధ్రా వంటి పరిస్థితి తలెత్తవచ్చు.. కర్నాటక మంత్రి సంచలన వ్యాఖ్య
Follow us

| Edited By:

Updated on: Dec 21, 2019 | 3:11 PM

సవరించిన పౌరసత్వ చట్టంపై ఓ వైపు దేశంలో నిరసనలు పెల్లుబుకుతుండగా.. మరోవైపు కర్నాటక మంత్రి సీ. టి. రవి వివాదాస్పద వ్యాఖ్య చేశారు. మెజారిటీ ప్రజల (హిందువుల) సహనాన్ని పరీక్షించవద్దని, ఒకప్పుడు గుజరాత్ లోని గోధ్రాలో ఏం జరిగిందో ఓ సారి గుర్తు తెచ్చుకోవాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేత యు.టి. ఖాదర్ ఇటీవల చేసిన ఓ వ్యాఖ్యకు కౌంటర్ గా రవి ఇలా తీవ్రంగా స్పందించారు. గోధ్రాలో కొంతమంది తమ మానసిక దౌర్బల్యంతో రైలుకు నిప్పు పెట్టి కరసేవకులను సజీవ దహనం చేశారని, అయితే ప్రతీకార విషయానికి వచ్ఛేసరికి ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు. ‘ ఆ ఘటనలో ప్రజలు ఎంతటి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారో.. మీరు మర్చిపోయి ఉండవచ్ఛు. దయచేసి దాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి ‘ అన్నారాయన. మంగుళూరులోని ప్రస్తుత పరిస్థితిని రవి గోధ్రా ఘటనతో పోలుస్తూ ఓ వీడియో ట్వీట్ చేశారు. దీనిపై మండిపడిన కర్నాటక పీసీసీ మాజీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు.. ఆ మంత్రి (సీ.టి.రవి) బెదిరించే విధంగా మరీ రెచ్ఛగొట్టే వ్యాఖ్య చేశారని, పోలీసులు ఆయనపై వెంటనే కేసు నమోదు చేసి ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవిలో ఉన్న ఒక వ్యక్తి ఇలా విషం చిమ్మరాదని కోరారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?