కర్ణాటక రాజకీయం.. సంక్షోభంలో కుమారస్వామి ప్రభుత్వం

కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రాజకీయ అస్థిరత మొదలై సోమవారానికి మూడు రోజులు కాగా.. తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కుమారస్వామి నానా తంటాలు పడుతున్నారు. తాజాగాతొమ్మిది మంది జేడీ-ఎస్ సభ్యులు రాజీనామాలు చేయగా.. ఈ నెల 9 న జేడీ-ఎస్, సీఎల్ఫీ మీటింగ్ జరగనుంది.అటు- మాజీ సీఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను సమర్పించారు. సీన్ ఇక రాజ్ భవన్ కు మారనుంది. ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించిన పక్షంలో కుమారస్వామి […]

కర్ణాటక రాజకీయం.. సంక్షోభంలో కుమారస్వామి ప్రభుత్వం
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 08, 2019 | 7:42 PM

కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రాజకీయ అస్థిరత మొదలై సోమవారానికి మూడు రోజులు కాగా.. తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కుమారస్వామి నానా తంటాలు పడుతున్నారు. తాజాగాతొమ్మిది మంది జేడీ-ఎస్ సభ్యులు రాజీనామాలు చేయగా.. ఈ నెల 9 న జేడీ-ఎస్, సీఎల్ఫీ మీటింగ్ జరగనుంది.అటు- మాజీ సీఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను సమర్పించారు. సీన్ ఇక రాజ్ భవన్ కు మారనుంది. ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించిన పక్షంలో కుమారస్వామి ప్రభుత్వం కుప్ప కూలడం ఖాయమన్న వార్తలు వినవస్తున్నాయి.

కాగా- ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నగేష్ సర్కార్ కు తన మద్దతు ఉపసంహరించుకున్నారు. తన మంత్రి పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ ముందుకు వస్తే మద్దతు తెలుపుతానని ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. మరోవైపు రెబల్ సభ్యులతో కుమారస్వామి మంతనాలు కొనసాగిస్తున్నారు. జేడీ-ఎస్ మాజీ చీఫ్ హెచ్. విశ్వనాథ్, మరో ఎమ్మెల్యే గోపాలయ్యలకు మంత్రి పదవులు ఇస్తామని ఆఫర్ ప్రకటించారు. అలాగే నారాయణ గౌడ అనే శాసన సభ్యునికి బోర్డు చైర్మన్ పోస్ట్ ఇస్తామని ఆశ చూపారు. అయితే వీరంతా ఈ ఆఫర్లను తిరస్కరించారు. కాంగ్రెస్ రెబల్ లీడర్ రామలింగారెడ్డితో.. కుమారస్వామి రహస్య స్థలంలో భేటీ అయ్యారు. సుమారు 15 నిముషాలసేపు ఆయనతో చర్చించారు. అటు-జేడీ-ఎస్ లెజిస్లేటర్లంతా బెంగుళూరుకు సుమారు 265 కి. మీ. దూరంలోని మదికేరలో ఓ హోటల్లో సమావేశమవుతున్నారు. ఈ సమావేశానికి కుమారస్వామి కూడా హాజరవుతున్నారు. ఇదిలా ఉండగా.నగేష్ రాజీనామా వెనుక తమ పార్టీ హస్తం లేదని మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత నేత ఆర్. అశోక్ తెలిపారు. నగేష్ కూడా ఎన్నో వేధింపులకు గురయ్యారని, అందుకే రాజీనామా చేశారని ఆయన చెప్పారు. .