ముంబాయి నాకిప్పుడు పీఓకేలా కనిపిస్తోంది ః కంగనా రనౌత్
నిత్యం ఎవరో ఒకరిపై నిప్పులు కురిపించే బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ఇవాళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌పై ఫైరయ్యారు.. ముంబాయి పోలీసులకు నమ్మకం లేకపోతే ముంబాయిలో అడుగుపెట్టవద్దంటూ..
నిత్యం ఎవరో ఒకరిపై నిప్పులు కురిపించే బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ఇవాళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌పై ఫైరయ్యారు.. ముంబాయి పోలీసులకు నమ్మకం లేకపోతే ముంబాయిలో అడుగుపెట్టవద్దంటూ సంజయ్ రౌత్ హెచ్చరించడంతో కంగనా అగ్గి మీద గుగ్గిలమయ్యారు. సంజయ్ బెదిరింపులు చూస్తుంటే తనకు ముంబాయి నగరం ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లా కనిపిస్తుందని కంగనా అన్నారు.. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత కంగనా బాలీవుడ్‌లోని బంధుప్రీతిపై చెడుగుడు ఆడారు.. మరోవైపు కేసును సరిగ్గా హ్యాండిల్ చేయడం లేదంటూ ముంబాయి పోలీసులపై కూడా కొన్ని విమర్శలు చేశారు.. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు సరికావంటూ సంజయ్ రౌత్ తమ పార్టీ అధికారపత్రిక సామ్నాలో పెద్ద వ్యాసమే రాశారు.. ముంబాయిలో ఉంటూ ముంబాయి పోలీసులపైనే అనుమానాలు వ్యక్తం చేయడం మంచిది కాదంటూ కంగనాను హెచ్చరికలతో కూడిన సూచనలు చేశారు. కంగనా వ్యాఖ్యలు ముంబాయి పోలీసులను అవమానించేట్టుగా ఉన్నాయని, ఇకపై ఆమె ముంబాయికి రాకుండా ఉంటే బాగుంటుందని రాసుకొచ్చారాయన. అక్కడితో ఆగకుండా ఆమెపై హోంశాఖ చర్యలు తీసుకోవాలని కోరారు..