రేపటి నుంచి మక్కా మసీద్ లో ప్రార్థనలు షురూ..

కరోనా వ్యాప్తి నేపథ్యంలో మూసివేసిన ప్రార్థన మందిరాలు మెల్లమెల్లగా తెరుచుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ మక్కా మసీదులో సెప్టెంబర్ 5 శనివారం నుంచి ప్రార్థనలకు హాజ‌ర‌య్యేందుకు అధికారులు అనుమతించారు. దాదాపు ఆరు నెలల తర్వాత తెరుచుకోబోతుంది మక్కా మసీద్.

  • Balaraju Goud
  • Publish Date - 4:31 pm, Thu, 3 September 20
రేపటి నుంచి మక్కా మసీద్ లో ప్రార్థనలు షురూ..

కరోనా వ్యాప్తి నేపథ్యంలో మూసివేసిన ప్రార్థన మందిరాలు మెల్లమెల్లగా తెరుచుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ మక్కా మసీదులో సెప్టెంబర్ 5 శనివారం నుంచి ప్రార్థనలకు హాజ‌ర‌య్యేందుకు అధికారులు అనుమతించారు. దాదాపు ఆరు నెలల తర్వాత తెరుచుకోబోతుంది మక్కా మసీద్. మొదటి 15 రోజుల్లో 50 మందికి మాత్రమే ప్రార్థ‌న‌ల‌కు అనుమ‌తిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత 100 మందికి అనుమతి ఉంటుంది. ప్రార్థనల సమయంలో ప్రతిఒక్కరు భౌతికదూరం పాటిస్తూ.. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.

దేశవ్యాప్తంగా ఆన్ లాక్ 4.0 ప్రక్రియలో భాగంగా ప్రార్థనా మందిరాలలకు పర్యాటక ప్రాంతాలకు కేంద్రం సడలింపులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో హదరాబాద్ మక్కా మసీద్ లోని ప్రార్థలకు అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ నేతృత్వంలో బుధ‌వారం అత్యున్న‌త‌స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మక్కా మసీదులో ప్రార్ధనలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా మక్కా మసీదు దాదాపు ఆరు నెలలుగా మూతపడింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈవో మొహద్ ఖాసిం స్పందిస్తూ… కోవిడ్-19 మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుస‌రిస్తూ, భౌతిక‌దూరాన్ని పాటిస్తూ మ‌సీదులో ప్రార్థ‌న‌ల‌కు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు చెప్పారు. మ‌సీదు ప్రాంగ‌ణాన్ని ప్రతిరోజు శానిటైజ్ చేస్తున్నామ‌న్నారు. రాబోయే రెండు రోజుల్లో ప్రార్థ‌న‌ల కోసం స్థ‌లాల‌ను మార్క్ చేయ‌నున్న‌ట్లు వెల్లడించారు.