త్వరలో అందుబాటులోకి వాక్సిన్.. సత్ఫలితాలిస్తున్న ట్రయల్స్..

ప్రపంచం మొత్తం కరోనా వైరస్ నుంచి ఎప్పుడు విముక్తి దొరుకుతుందానని ఆశగా ఎదురుచూస్తుంది. అయితే అతిత్వరలో వ్యాక్సిన్‌ను అందుబాటు తేనున్నట్లు అమెరికా వెల్లడించింది.

త్వరలో అందుబాటులోకి వాక్సిన్.. సత్ఫలితాలిస్తున్న ట్రయల్స్..
Follow us

|

Updated on: Sep 03, 2020 | 4:09 PM

ప్రపంచం మొత్తం కరోనా వైరస్ నుంచి ఎప్పుడు విముక్తి దొరుకుతుందానని ఆశగా ఎదురుచూస్తుంది. అయితే అతిత్వరలో వ్యాక్సిన్‌ను అందుబాటు తేనున్నట్లు అమెరికా వెల్లడించింది. క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అమెరికాకు చెందిన సెంట‌ర్స్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్‌(సీడీసీ).. ఆరోగ్య‌శాఖ అధికారుల‌కు ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేసింది. 50 రాష్ట్రాల‌కు చెందిన ఆరోగ్య‌శాఖ అధికారులు.. న‌వంబ‌ర్ ఒక‌ట‌వ తేదీ నుంచి టీకాను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉండాల‌ని సీడీసీ పేర్కొన్న‌ది. న‌వంబ‌ర్ 3వ తేదీన అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో.. న‌వంబ‌ర్ ఒక‌టో తేదీనే వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా చేయాల‌ని నిర్ణ‌యించారు. తొలుత హెల్త్ కేర్ ప్రొఫెష‌న‌ల్స్‌కు, ఆ త‌ర్వాత 65 ఏళ్లు దాటిన వాళ్ల‌కు, ఎక్కువ రిస్క్ ఉన్న ప్రాంతాల వారికి టీకాల‌ను ఇవ్వ‌నున్నట్లు సమాచారం

ప‌లు ర‌కాల వ్యాక్సిన్ కంపెనీలు వివిధ ద‌శ‌ల్లో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తున్నాయి. కొన్ని తుది ద‌శ‌కు చేరుకున్నాయి. అమెరికా అంటువ్యాధుల సంస్థ అధిప‌తి డాక్ట‌ర్ ఆంథోనీ ఫౌసీ కూడా వ్యాక్సిన్ త్వ‌ర‌గా వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు చెప్పారు. ఒక‌వేళ ప‌రీక్ష‌ల్లో పాజిటివ్ ఫ‌లితం ఎక్కువ‌గా ఉంటే.. ట్ర‌య‌ల్స్ పూర్తి అయ్యేలోపే వ్యాక్సిన్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలిపారు. కానీ రాజ‌కీయ ప్రోద్భ‌లంతోనే సీడీసీ త్వ‌ర‌గా వ్యాక్సిన్ పంపిణీ కోసం త‌హ‌త‌హ‌లాడుతున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

అయితే, ప్రయోగాత్మక కరోనావైరస్ వ్యాక్సిన్ ప్రారంభ ఫలితాలు పెద్దగా సమస్యలను చూపించవని.. ఇది కావలసిన రోగనిరోధక వ్యవస్థని పెంపొందిస్తుంటున్నారు పరిశోధకులు. ఇందుకు సంబంధించి బుధవారం న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ఓ ఆర్టికల్ ను ప్రచురించారు.

మూడు వారాల వ్యవధిలో రెండు షాట్లుగా ఇవ్వబడిన వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి మేరీల్యాండ్‌లోని గైథర్స్ బర్గ్ కేంద్రంగా ఉన్న నోవావాక్స్ అనే సంస్థకు అమెరికా ప్రభుత్వం 6 1.6 బిలియన్లను ముట్టజెప్పంది. కరోనావైరస్ నుండి ఇన్ఫెక్షన్ తో పోరాడటానికి ప్రతిరోధకాలను తయారు చేయడానికి ఒప్పందం మేరకు చెల్లింపులు జరిపింది. అలాగే రోగనిరోధక శక్తిని ప్రేరేపించడానికి వ్యాక్సిన్ లో ఒక ప్రోటీన్ కూడా ఇందులో చేర్చినట్లు జర్నల్ పేర్కొన్నారు.

కాగా, ఈ అధ్యయనం 108 ఆరోగ్యకరమైన వ్యక్తులలో రెండు మోతాదు స్థాయిల్లోనూ పరీక్షించింది. ప్లేసిబో షాట్లు పొందిన 23 మందిలోని ప్రతిస్పందనలను ఎప్పటికప్పుడు పోల్చి చూసినట్లు తెలిపారు. వ్యాక్సిన్ ఇచ్చిన వారిలో చాలా మందిలో రోగనిరోధక వ్యవస్థ పెంచడానికి ఉపయోగపడిందన్నారు. తక్కువ మోతాదుతో పొందిన వారు కోవిడ్ -19 తో సహజ సంక్రమణ నుండి కోలుకుంటున్నారని జర్నల్ లో వివరించారు. ప్రజలలో సాధారణంగా కనిపించే దానికంటే చాలా ఎక్కువ సంఖ్యలో రోగనిరోధకశక్తి పెరిగిందని పరిశోధకులు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా టీకా తయారీలో దృష్టి సారించిన లాభాపేక్షలేని కూటమి ఫర్ ఎపిడెమిక్ ప్రిపరేడ్‌నెస్ ఇన్నోవేషన్స్ ఈ పనిని స్పాన్సర్ చేసింది. ఇక, మరో మూడు ప్రయోగాత్మక టీకాలు యునైటెడ్ స్టేట్స్ లో చివరి దశ పరీక్షలో ఉన్నాయి.