కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం ఆంధ్రప్రదేశ్‌ కేబినేట్‌ సమావేశమై పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా తాజాగా తీసుకొచ్చిన ఉచిత విద్యుత్‌ పథకం- నగదు బదిలీకి రాష్ట్ర మంత్రి వర్గం..

కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Sep 03, 2020 | 3:52 PM

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం ఆంధ్రప్రదేశ్‌ కేబినేట్‌ సమావేశమై పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా తాజాగా తీసుకొచ్చిన ఉచిత విద్యుత్‌ పథకం- నగదు బదిలీకి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీనితోపాటు కేబినెట్ భేటీలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రిమండలి భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. రైతుకు అందే విద్యుత్తు ఎప్పటికీ ఉచితమేనని, ఒక్క కనెక్షన్‌ కూడా తొలగించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల వల్ల రైతుపై ఒక్కపైసా భారం కూడా పడదన్నారు. వచ్చే 30–35ఏళ్లపాటు ఉచిత విద్యుత్‌ పథకానికి ఢోకా లేకుండా చేస్తున్నట్లు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా ఉచిత విద్యుత్‌ పథకం అమలు కానున్నట్లు చెప్పారు. అదే విధంగా ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు పేర్కొన్నారు. రైతులకు పగటిపూట ఉచిత విద్యుత్ ఇచ్చే క్రమంలో ప్రభుత్వంపై ఇప్పటివరకు రూ.8,300 కోట్ల పైచిలుకు భారం పడిందని వివరించారు. రాబోయే రోజుల్లో ఇది పెరిగే అవకాశం ఉందని.. అయినా మరింత మంది రైతులకు మేలు చేస్తామని చెప్పారు. ఈ భారం తగ్గించుకునేందుకు సీఎం జగన్ ప్రభుత్వం 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ పార్కు ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు.