కంగన రనౌత్ వర్సెస్ దిల్జీత్ దోసాంజి.. రోజు రోజుకు ముదురుతున్నవివాదం.. మరో ట్వీట్ చేసిన ఫైర్ బ్రాండ్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా మరోసారి వార్తల్లో నిలిచింది. పంజాబీ రైతుల నిరసనల నేపథ్యంలో కంగన కామెంట్లను వ్యతిరేకిస్తూ నటుడు దిల్జీత్ దోసాంజి వరుస ట్వీట్లు చేశారు.

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన మరోసారి వార్తల్లో నిలిచింది. పంజాబీ రైతుల నిరసనల నేపథ్యంలో కంగన కామెంట్లను వ్యతిరేకిస్తూ నటుడు దిల్జీత్ దోసాంజి వరుస ట్వీట్లు చేశారు. దీంతో ఆ ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. తాజా ట్వీట్ లో కంగన మరోసారి దిల్జీత్ పై పంచ్ వేసింది.“రైతుల నిరసనలు.. ఇస్లాం అనుకూల.. భారత వ్యతిరేక చిత్ర పరిశ్రమకు చెందిన బ్రాండ్లు అన్నీ వరదలో కొట్టుకుపోతాయి” అంటూ దిల్జీత్ – ప్రియాంక చోప్రాలను ఉద్ధేశించి కంగన ట్వీట్స్ చేసింది.
దానికి కౌంటర్ గా దిల్జీత్ దోసాంజి తన ఇన్ స్టాలో “లోల్ ” “ఆఫ్టర్ ఎఫెక్ట్స్” అనే పదాలను ఉపయోగించారు. అంతటితో ఆగకుండా.. “ఈ రోజు హైదరాబాద్ లో 12 గంటల షిఫ్ట్ లో పనిచేసిన తరువాత సాయంత్రం నేను ఓ ఈవెంట్ లో హాజరు కావడానికి చెన్నైకి వెళ్లాను. అది ఒక ఛారిటీ ఈవెంట్. నేను పసుపు రంగులో ఎలా కనిపిస్తున్నాను? అంటూ యాష్ ట్యాగ్ దిల్జీత్ కిట్టే ట్విట్టర్ లో అతని కోసం వెతుకుతున్నారు. అంటూ పోస్ట్ పెట్టింది కాంగన. మరి ఈ ట్వీట్ కు దిల్జీత్ ఎలా రీప్లే ఇస్తాడో చూడాలి.
Today after working in a 12 hours shift in Hydrabad this evening I flew down to Chennai to attend a charity event, how do I look in yellow? Also #Diljit_Kitthe_aa ? Everyone is looking for him here on twitter ? pic.twitter.com/Sbx6K4Shvb
— Kangana Ranaut (@KanganaTeam) December 11, 2020
