బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న నాని.. త్వరలో డిజిటల్ ఎంట్రీకి కూడా రెడీ అవుతున్నాడు
యంగ్ హీరో నాని ఇటీవల 'వి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
యంగ్ హీరో నాని ఇటీవల ‘వి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం నాని ‘టక్ జగదీష్’, ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలతో పాటు ‘అంటే సుందరానికి’ అనే సినిమాకూడా చేస్తున్నాడు. ఓ వైపు హీరోగా మరో వైపు నిర్మాతగా రాణిస్తున్న నానిఇప్పడు డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తుంది.
నెట్ ఫ్లిక్స్ రూపొందించే ఓ వెబ్ సిరీస్‌లో నాని నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సిరీస్ లో నాని ప్రధాన పాత్రను పోషించబోతున్నట్టు సమాచారం. నాని వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిలింనగర్లో వార్త చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం టాక్ జగదీశ్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు నాని, ఈ షూటింగ్ పూర్తయిన వెంటనే ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాను చేస్తున్నాడు. అది పూర్తయిన వెంటనే ‘అంటే సుందరానికి’ స్టార్ట్ చేస్తున్నాడు. ఈ మూడు పూర్తయిన తర్వాత వెబ్ సిరీస్ మొదలు పెట్టనున్నాడు నాని.