కమలా హారిస్‌కు తండ్రితో సన్నిహిత సంబంధాలు లేవా ?
భారతీయ సంతతికి చెందిన అమెరికన్ సెనేటర్, డెమొక్రాటిక్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి కమలా హారిస్..ఆమె తండ్రి డొనాల్డ్ హారిస్‌కు మధ్య సన్నిహిత సంబంధాలు లేవని ఒక మీడియా నివేదిక తెలిపింది.

భారతీయ సంతతికి చెందిన అమెరికన్ సెనేటర్, డెమొక్రాటిక్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి కమలా హారిస్..ఆమె తండ్రి డొనాల్డ్ హారిస్‌కు మధ్య సన్నిహిత సంబంధాలు లేవని ఒక మీడియా నివేదిక తెలిపింది. తల్లిదండ్రులు విడిపోయిన అనంతరం…కుమార్తెల బాధ్యతలను పూర్తిగా తల్లి శ్యామల చూసుకున్నారని, డొనాల్డ్‌తో వారికి సన్నిహిత సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని సదరు రిపోర్ట్ వెల్లడించింది.
శ్యామలా-డొనాల్డ్ విడిపోయిన అనంతరం..డొనాల్డ్ తన కుమార్తెలతో ఉన్న సంబంధాలు పూర్తిగా అంతమయ్యాయని జమైకాకు చెందిన ఎకనామిక్స్ ప్రొఫెసర్ విచారం వ్యక్తం చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదిక పేర్కొంది. కమలా హారిస్ తల్లి శ్యామల గోపాలన్, క్యాన్సర్ జీవశాస్త్రవేత్త. క్యాన్సర్‌ను నయం చేయాలనే తన కలను కొనసాగించడానికి భారతదేశం నుంచి 19 సంవత్సరాల వయస్సులో అమెరికాకు వచ్చారు. డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో మాట్లాడిన కమలా హారిస్.. తన తల్లి గురించి ప్రేమగా, చాలా గొప్పగా మాట్లాడారు. కాని తండ్రి గురించి పొడి, పొడి పదాలు మాత్రమే మాట్లాడారు. దీంతో ఆ వాదనకు బలం చేకూరుంది.
కాలిఫోర్నియా బర్కిలీ విశ్వవిద్యాలయంలో జమైకా నుండి ఆర్ధికశాస్త్రం అభ్యసించడానికి వచ్చిన తన తండ్రిని తన తల్లి కలుసుకుందని, 1960 నాటి పౌర హక్కుల ఉద్యమంలో న్యాయం కోసం కలిసి కవాతు చేస్తున్నప్పుడు, వారు ప్రేమలో పడ్డారని కమలా తెలిపారు. నా తల్లి ..నా సోదరి మాయతో పాటు నాలో మన జీవిత గమనాన్ని సూచించే విలువలను చొప్పించింది. గర్వంగా, బలమైన నల్లజాతి స్త్రీలుగా ఆమె మమ్మల్ని పెంచింది. మన భారతీయ వారసత్వం గురించి తెలుసుకోవటానికి, గర్వపడటానికి ఆమె ఆరాటపడింది అని 55 ఏళ్ల హారిస్ బుధవారం తన ప్రసంగంలో పేర్కొన్నారు.




