టాయిలెట్లు క్లీన్ చేసే స్థాయి నుంచి.. జెన్సన్ హువాంగ్ సంచలన ప్రస్థానం!
Jensen Huang Journey: ఒకప్పుడు స్కూల్లో టాయిలెట్లు శుభ్రం చేసిన వ్యక్తి.. రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేసిన యువకుడు.. ఆ తర్వాత ప్రపంచ టెక్నాలజీ రంగంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు. ఏఐ చిప్స్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఎన్విడియా (NVIDIA) సామ్రాజ్యాన్ని నిర్మించారు జెన్సన్ హువాంగ్. అయితే చైనా గూడఛారిగా అనుమానిస్తున్న మహిళతో లైంగిక సంబంధాల కారణంగా ఆయన ఇమేజ్ ఒక్కసారిగా పడిపోయింది. తన పదివితో పాటు పేరు ప్రతిష్టలను కోల్పోయారు. ఆయన జీవితంలో ఎదురైన కష్టాలు, సాధించిన విజయాలు, తాజాగా చోటుచేసుకున్న పరిణామాల గురించి తెలుసుకుందాం.

ఒకప్పుడు స్కూల్లో టాయిలెట్లు శుభ్రం చేసిన వ్యక్తి.. ఆ తర్వాత రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేసిన యువకుడు.. ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీ రంగంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా ఎదిగారు. ఆయనే ఎన్విడియా(NVIDIA) సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్. ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్నాలజీ సంస్థల్లో ఒకటిగా ఎన్విడియాను తీర్చిదిద్దిన ఆయన ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. తాజా వివాదాల నేపథ్యంలో ఎంత వేగంగా ఎదిగారో అంతే వేగంగా ఆయన పతనం చెందారు.
బాల్యం.. ఎన్నో సవాళ్లు
జెన్సన్ హువాంగ్ 1963లో తైవాన్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు జెన్-హ్సున్ హువాంగ్. చిన్నతనంలోనే కుటుంబంతో కలిసి థాయ్‌లాండ్‌కు వెళ్లారు. అనంతరం అమెరికాకు వలస వెళ్లారు. అక్కడి విద్యాభ్యాస సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిన్న వయసులోనే ఆయనను, ఆయన సోదరుడిని అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో ఉన్న బోర్డింగ్ స్కూల్‌లో చేర్పించారు. అయితే అది సాధారణ పాఠశాల కాకుండా సమస్యాత్మక విద్యార్థుల కోసం నిర్వహించే ఓ విద్యా సంస్థ. అక్కడ జెన్సన్ హువాంగ్ ఇంగ్లీష్ భాషలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు తోటి విద్యార్థుల నుంచి వేధింపులు ఎదుర్కొన్నారు. స్కూల్లో టాయిలెట్లు కూడా శుభ్రం చేయాల్సి వచ్చేది. అయినప్పటికీ చదువుపై దృష్టి కోల్పోలేదు. కష్టపడి చదివి ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారు. అనంతరం రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కంప్యూటర్ రంగంపై ఆసక్తితో తన కెరీర్‌ను అటువైపు మళ్లించారు.
ఇద్దరు స్నేహితులతో కలిసి..
1993లో జెన్సన్ హువాంగ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఎన్విడియాను స్థాపించారు. సిలికాన్ వ్యాలీలోని డెన్నీస్ రెస్టారెంట్‌లో కూర్చొని ఈ కంపెనీ ఆలోచనకు రూపమిచ్చారు. కేవలం 40 వేల డాలర్ల ప్రారంభ పెట్టుబడితో ఆ సంస్థ ప్రస్థానం మొదలైంది. సాధారణ కంప్యూటర్లు పరిష్కరించలేని సమస్యలకు పరిష్కారాలు అందించాలనే లక్ష్యంతో ఆయన పనిచేశారు. ముఖ్యంగా 3డీ గ్రాఫిక్స్‌ను వేగంగా ప్రాసెస్ చేయగల చిప్స్ తయారీపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ (GPU) రంగంలో ఎన్విడియా కీలక సంస్థగా ఎదిగింది. 1999లో ఎన్విడియా తొలి GPUను తయారు చేసింది. మొదట వీడియో గేమ్స్‌లో గ్రాఫిక్స్ నాణ్యతను పెంచేందుకు ఉపయోగించిన ఈ చిప్స్.. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులకు పునాది వేశాయి. చాట్‌జీపీటీ వంటి జనరేటివ్ ఏఐ టెక్నాలజీలకు అవసరమైన భారీ గణనలను నిర్వహించడంలో ఎన్విడియా చిప్స్ కీలకంగా మారాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిప్స్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది.
లెదర్ జాకెట్‌తో ప్రత్యేక గుర్తింపు
జెన్సన్ హువాంగ్ తన వ్యాపార విజయాలతో పాటు ప్రత్యేకమైన వ్యక్తిత్వంతోనూ గుర్తింపు పొందారు. దాదాపు ఎప్పుడూ నల్లటి టీషర్ట్, లెదర్ జాకెట్‌లో కనిపిస్తుంటారు. ఇదే ఆయనకు ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్‌ను తీసుకొచ్చింది. ఎన్విడియా ఎదుగుదలతో ఆయన సంపద కూడా భారీగా పెరిగింది. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం ఆయన సంపద సుమారు 160 బిలియన్ డాలర్లకు చేరింది. తైవాన్‌లో ఆయనకు సినీ తారల స్థాయిలో అభిమానులు ఉన్నారు.
రాజకీయ సంబంధాలు.. వివాదాలు
ఎన్విడియా ఎదుగుదలతో జెన్సన్ హువాంగ్ అమెరికా రాజకీయ వర్గాల్లోనూ ప్రాధాన్యం సంపాదించారు. ముఖ్యంగా చైనాకు అధునాతన చిప్స్ ఎగుమతులపై అమెరికా ఆంక్షలు విధించిన సమయంలో ఆయన కొన్ని విధానాలను వ్యతిరేకించారు. ఈ ఆంక్షలు అమెరికా సెమీకండక్టర్ పరిశ్రమకు నష్టం కలిగించవచ్చని హెచ్చరించారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఆయనతోనూ సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఏఐ రంగానికి అనుకూలమైన విధానాలపై చర్చల్లో పాల్గొన్నారు. అయితే చైనాకు చిప్స్ విక్రయాల విషయంలో ఆయన వైఖరిపై అమెరికాలోని కొందరు రాజకీయ నాయకులు విమర్శలు చేశారు.
వ్యక్తిగత వివాదం.. ఎన్విడియాలో కీలక పరిణామం
ఇటీవల జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆరోపణలు కూడా వార్తల్లో నిలిచాయి. చైనాకు చెందిన ఆలిస్ హువాంగ్‌తో ఆయనకు వివాహేతర సంబంధం ఉన్నట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఆమెకు చైనా నిఘా వర్గాలతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలను అమెరికా అధికారులు వ్యక్తంచేస్తున్నారు. అయితే చైనా విదేశాంగ శాఖ ఈ ఆరోపణలను నిరాధారమైనవిగా కొట్టిపారేసింది. నవంబర్ 8న ఎన్విడియా ఉద్యోగులకు రాసిన లేఖలో తన భార్యకు నమ్మకద్రోహం చేసినట్లు జెన్సన్ అంగీకరించి క్షమాపణలు చెప్పారు. ఆలిస్ హువాంగ్‌తో తనకు లైంగిక సంబంధమున్నట్లు ఆయన అంగీకరించారు. అనంతరం కంపెనీ ఆయనపై విచారణ ప్రారంభించింది.
భారీగా నష్టపోయిన ఎన్వీడియా షేర్లు
ఈ వివాదం కారణంగా ఎన్వీడియా షేర్లు భారీగా నష్టపోయాయి. నవంబర్ 12న జెన్సన్ హువాంగ్ ఎన్విడియా సీఈఓ పదవికి రాజీనామా చేయడంతో పాటు కంపెనీ బోర్డు నుంచి కూడా తప్పుకున్నారు. అయితే ఆయన నిష్క్రమణకు గల కారణాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. తాత్కాలిక సీఈఓగా కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కొలెట్ క్రెస్ బాధ్యతలు చేపట్టారు. దాదాపు 33 ఏళ్ల పాటు ఎన్విడియాతో విడదీయలేని అనుబంధం కలిగిన జెన్సన్ హువాంగ్ నిష్క్రమణ టెక్నాలజీ ప్రపంచంలో కీలక పరిణామంగా మారింది. శాశ్వత సీఈఓ ఎంపిక కోసం అంతర్గత, బాహ్య అభ్యర్థులను పరిశీలించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఒకప్పుడు టాయిలెట్లు శుభ్రం చేసిన బాలుడు.. ప్రపంచ ఏఐ విప్లవానికి అవసరమైన చిప్స్ తయారు చేసే సంస్థను నిర్మించిన వ్యాపారవేత్తగా ఎదగడం జెన్సన్ హువాంగ్ జీవితంలోని ఆసక్తికరమైన మలుపు. ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకమే అయినప్పటికీ, చైనా స్పైగా అనుమానిస్తున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం కారణంగా ఆయన పేరు ప్రతిష్టలు మసకబారాయి.




