జగన్ దమ్మున్న నేత.. బాబుకు జెసీ మరో ఝలక్
టిడిపి నేత, మాజీ ఎంపీ జెసి దివాకర్ రెడ్డి మరోసారి సొంత పార్టీ అధినేతకు ఝలక్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలో వుంటూ అధికార పార్టీ అధినేతను, ముఖ్యమంత్రిని ఆకాశానికెత్తేశారు. నిజానికి జెసి ఎప్పుడేం మాట్లాడినా అది న్యూసే. ఆయన మాటలు సెన్సేషనే. అలాంటి జెసి దివాకర్ రెడ్డి మరోసారి తన వ్యాఖ్యలతో సొంత పార్టీ నేతలను ఇరకాటంలో పడేశారు. ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గట్స్ ఉన్న నాయకుడని జెసి కితాబునిచ్చారు. తాను చేయాలనుకున్న పనిని జగన్ […]

టిడిపి నేత, మాజీ ఎంపీ జెసి దివాకర్ రెడ్డి మరోసారి సొంత పార్టీ అధినేతకు ఝలక్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలో వుంటూ అధికార పార్టీ అధినేతను, ముఖ్యమంత్రిని ఆకాశానికెత్తేశారు. నిజానికి జెసి ఎప్పుడేం మాట్లాడినా అది న్యూసే. ఆయన మాటలు సెన్సేషనే. అలాంటి జెసి దివాకర్ రెడ్డి మరోసారి తన వ్యాఖ్యలతో సొంత పార్టీ నేతలను ఇరకాటంలో పడేశారు.
ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గట్స్ ఉన్న నాయకుడని జెసి కితాబునిచ్చారు. తాను చేయాలనుకున్న పనిని జగన్ దైర్యంగా చేస్తారని, ఆరోగ్య శ్రీ విషయంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి హ్యాట్సాఫ్ చెబుతున్నానని జెసి బుధవారం నాడు అసెంబ్లీ ఆవరణలో కామెంట్లు చేశారు. ఒక వైపు సభలో వైసీపీ, టిడిపి మధ్య మాటల యుద్దం నడుస్తుండగా.. జెసి దివాకర్ రెడ్డి జగన్‌ను పొగడడం తెలుగుదేశం నేతలకు తలనొప్పిగా మారింది.
జెసి దివాకర్ రెడ్డి మరో అడుగు ముందుకేసి, ముఖ్యమంత్రి జగన్ ఎదురైతే తప్పకుండా అభినందిస్తానని అన్నారు. ఈ విషయంలో చంద్రబాబు ఏమనుకున్నా తాను పట్టించుకోనని కుండబద్దలు కొట్టారు జెసి దివాకర్ రెడ్డి. ఆరోగ్య శ్రీ ఎంతో మందికి ఉపయోగపడుతుందని చెప్పిన జెసి, జగన్ ఆరు నెలల పాలన చాలా బాగుందని మెచ్చుకున్నారు.




