మరోసారి లాక్‌డౌన్.. చారిత్రాత్మిక తప్పిదం: నాగబాబు

రాష్ట్రంలో పలు చోట్ల మరోసారి లాక్ డౌన్ ఉంటుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై నాగబాబు స్పందించారు. ''మరోసారి లాక్ డౌన్ విధించడం ప్రభుత్వాలు చేస్తున్న చారిత్రాత్మక తప్పిదం అవుతుందన్నారు.

మరోసారి లాక్‌డౌన్.. చారిత్రాత్మిక తప్పిదం: నాగబాబు
Follow us

|

Updated on: Jul 01, 2020 | 9:25 AM

తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 16,339 కరోనా కేసులు నమోదు కాగా.. అందులో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 12,682 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో ఇప్పటిదాకా 260 కరోనా మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో మరోసారి కఠినంగా లాక్ డౌన్ విధించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిపై ఇవాళ, రేపో క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో పలు చోట్ల మరోసారి లాక్ డౌన్ ఉంటుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై సినీ నటుడు, జనసేన నేత నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్పందించారు.

”ఇప్పుడున్న పరిస్థితుల్లో మరోసారి లాక్ డౌన్ విధించడం ప్రభుత్వాలు చేస్తున్న చారిత్రాత్మక తప్పిదం అవుతుందన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు సుమారు 60 నుంచి 90 రోజుల పాటు దేశంలో లాక్ డౌన్ విధించారు. వెరీ గుడ్. కానీ ఇప్పుడు మళ్లీ లాక్ డౌన్ పెట్టి.. జనజీవనాన్ని స్తంభిపచేయడం అన్నది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఈ 90 రోజుల పాటు మీరు విధించిన లాక్ డౌన్‌లో.. మెడికల్ రిసోర్స్ అన్ని కూడా సమకూర్చుకుని.. సెంట్రల్ గవర్నమెంట్ అయినా.. స్టేట్ గవర్నమెంట్స్ అయినా కూడా కరోనాను జయించేందుకు శక్తులన్నింటిని కూడగట్టుకుని సిద్ధంగా ఉండాలి. అలా కాదని ఇప్పుడు మరోసారి లాక్ డౌన్ విధిస్తున్నామంటూ ప్రకటిస్తే మాత్రం అది చారిత్రాత్మక తప్పిదం అవుతుందని అన్నారు. ప్రజలందరూ కూడా 90 రోజుల పాటు వారి జీవితాలను వదిలేశారు. ముఖ్యంగా వలస కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. లాక్ డౌన్ సమయంలో వీరందరూ కూడా చాలా నష్టపోయారు. మూగజీవాల పరిస్థితి అయితే దయనీయంగా మారింది. అలాంటిది ఇప్పుడు మళ్లీ లాక్ డౌన్ పెట్టాలనే ఆలోచన వస్తే మాత్రం దాన్ని విరమించుకోవాలని నాగబాబు ఓ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు.

Also Read: చైనాపై మరో యుద్ధానికి భారత్ సిద్ధం.. ఈసారి అంతకుమించి..!

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..