చైనాపై మరో యుద్ధానికి భారత్ సిద్ధం.. ఈసారి అంతకుమించి..!
Huawei.. టెక్ రంగంలో ఈ పేరుకు పెద్ద చరిత్రే ఉంది. గత 20 సంవత్సరాలుగా భారత్‌లో తన ఉనికిని చాటుతున్న Huaweiపై త్వరలోనే బ్యాన్ విధించే ఛాన్స్‌లు ఉన్నాయా అంటే.?

Huawei.. టెక్నాలజీ రంగంలో ఈ పేరుకు పెద్ద చరిత్రే ఉంది. చైనాకు చెందిన ఈ టెక్ దిగ్గజం 5జీలో గ్లోబల్ మార్కెట్ లీడర్ అని చెప్పవచ్చు. గత 20 సంవత్సరాలుగా భారత్‌లో తన ఉనికిని చాటుతున్న Huaweiపై త్వరలోనే బ్యాన్ విధించే ఛాన్స్‌లు ఉన్నాయంటే? కేంద్ర వర్గాల నుంచి అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి.
డ్రాగన్ కంట్రీ దురాక్రమాన్ని, దూకుడును మరింతగా కట్టడి చేసేందుకు మోదీ సర్కార్ మరో షాకింగ్ డెసిషన్ తీసుకునేందుకు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టిక్‌టాక్‌తో సహా 59 చైనా యాప్‌లపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం.. త్వరలోనే చైనీస్ 5జీ పరికరాలను కూడా బ్యాన్ చేసేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. సోమవారం జరిగిన సమావేశంలో అగ్రశ్రేణీ మంత్రుల బృందం ఈ అంశంపైనే చర్చించారని తెలుస్తోంది.
వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి, గోప్యతకు భంగం కలుగుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచి భారత్‌లో 59 చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. ఇందులో టిక్‌టాక్, హలో, షేర్‌ఇట్ వంటి యాప్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు చైనా దుందుడుకుతనానికి పూర్తిగా కళ్లెం వేసేందుకు 5జీ పరికరాలపై నిషేధం విధించే అంశంపై మంత్రులు కీలక విషయాలను చర్చించారని కేంద్రవర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే వాస్తవానికి 5జీ స్పెక్ట్రమ్ వేలం ఎప్పుడో జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్, వొడాఫోన్, ఐడియా వంటి టెలికాం సంస్థల ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండటంతో ఆ వేలం కాస్తా ఏడాది వాయిదా పడింది. ఇక ఈ 5జీ వ్యవహారంలో Huawei కీలకం కానుంది. ఇప్పటికే ఈ సంస్థపై అమెరికాలో నిషేధం కొనసాగుతోంది.
Huawei అధినేతకు, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ పలు ఆరోపణలు రావడంతో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ నిషేధిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. భారత్, బ్రిటన్ దేశాలు కూడా ఇలాంటి చర్యలే తీసుకోవాలని కూడా అమెరికా కోరింది. కాగా, ఇప్పటికే కేంద్రం 4జీకి సంబంధించి చైనా పరికరాలు వాడొద్దంటూ బీఎస్ఎన్ఎల్‌కి ఆదేశాలు ఇచ్చింది. దీనితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి త్వరలోనే మరో సంచలన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.?
Also Read: బ్రేకింగ్: చైనాలో మరో కొత్త వైరస్.. మానవజాతికి మరో డేంజర్..