AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈవారం ఓటీటీలో భయపెట్టడానికి రెడీ అయిన హారర్ మూవీస్ ఇవే.. ఆ ఒక్క సినిమా వెరీ స్పెషల్

ఈ వారం హారర్ సినిమాల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు గుడ్‌ న్యూస్. మూడు హారర్ చిత్రాలు వివిధ ఓటీటీ వేదికలపై స్ట్రీమింగ్‌కి సిద్ధమయ్యాయి. ఈ మూడు సినిమాలు మూడు భిన్న శైలుల్లో ఉండబోతున్నాయి. ఆ మూడు హారర్ చిత్రాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈవారం ఓటీటీలో భయపెట్టడానికి రెడీ అయిన హారర్ మూవీస్ ఇవే.. ఆ ఒక్క సినిమా వెరీ స్పెషల్
Ott Horror Movies Streaming This Week
Prashanthi V
|

Updated on: Apr 08, 2025 | 12:07 PM

Share

మూడు హారర్ చిత్రాలు వివిధ ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్‌లలో సందడి చేయబోతున్నాయి. అందులో ఒకటి నేరుగా ఓటీటీలో ప్రీమియర్ కాబోతుండగా.. మరో సినిమా తమిళంలో రూపొందించి ఇప్పుడు తెలుగులోకి అనువదించి రాబోతోంది. ఇక మూడోది మామూలు హారర్ కాకుండా వినోదాన్ని కలిపిన తెలుగు హారర్ కామెడీ మూవీగా ప్రేక్షకులను అలరించబోతోంది. థ్రిల్లింగ్ కంటెంట్‌కు ఇష్టపడే వాళ్లకు ఈ వారం ఓటీటీలో మంచి ఎంటర్టైన్‌మెంట్ అందించబోతోంది.

చోరీ 2

బాలీవుడ్ నటి నుష్రత్ భరూచా ప్రధాన పాత్రలో నటించిన చోరీ 2 హారర్ థ్రిల్లర్ మూవీగా రూపొందింది. ఈ సినిమా ఏప్రిల్ 11న డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. థియేటర్లకు వెళ్లకుండా ఓటీటీలోనే విడుదలవుతున్న ఈ చిత్రంలో ఒక తల్లి తన పిల్లను కాపాడేందుకు చేసే పోరాటం, భయంకరమైన అనుభవాలు, దెయ్యాల వంటి అతీత శక్తుల నేపథ్యంలో సాగుతుంది. నటి నుష్రత్ ఈ కథలో భావోద్వేగాలు బాగా ఉన్నాయి అని చెప్పారు. ఈ సినిమాకు దర్శకుడు విశాల్ ఫురియా దర్శకత్వం వహించారు. సోహా అలీ ఖాన్, గష్మీర్ మహాజనీ, సౌరభ్ గోయల్ వంటి నటులు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.

కింగ్స్టన్

తమిళ హారర్ ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన కింగ్స్టన్ అనే చిత్రం ఏప్రిల్ 13న జీ5 ఓటీటీలో మధ్యాహ్నం 12 గంటల నుండి అందుబాటులోకి రానుంది. తెలుగులోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. జీవీ ప్రకాష్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సముద్ర తీరంలో జరిగే అనూహ్య సంఘటనల చుట్టూ తిరుగుతుంది. కమల్ ప్రకాష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదట థియేటర్లలో విడుదలైనప్పటికీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.

టుక్ టుక్

తెలుగు హారర్ కామెడీగా తెరకెక్కిన టుక్ టుక్ అనే చిత్రం ఏప్రిల్ 10న ఈటీవీ విన్‌ ఓటీటీ వేదికగా విడుదలవుతుంది. స్కూటర్‌లో దెయ్యం కనిపించడం అనే విభిన్నమైన కాన్సెప్ట్ చుట్టూ కథ నడుస్తుంది. హర్ష్ రోహణ్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సుప్రీత్ కృష్ణ దర్శకత్వం వహించారు. మార్చి 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

Ott Horror Movies Streaming This Week