Jagan on Vaccination: వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌పై కీలక వ్యాఖ్యలు.. ఫిబ్రవరి దాకా సాధ్యం కాదని వ్యాఖ్య

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. దేశ జనాభా, రాష్ట్రాల అవసరాలు..

Jagan on Vaccination: వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌పై కీలక వ్యాఖ్యలు.. ఫిబ్రవరి దాకా సాధ్యం కాదని వ్యాఖ్య
Vaccine
Follow us
Rajesh Sharma

|

Updated on: Apr 29, 2021 | 5:26 PM

Jagan on vaccination program says its longer process: ఏపీ ముఖ్యమంత్రి (AP CHIEF MINISTER) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS JAGAN MOHAN REDDY) కరోనా వ్యాక్సినేషన్ (CORONA VACCINATION) కార్యక్రమంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. దేశ జనాభా, రాష్ట్రాల అవసరాలు, వ్యాక్సిన్ ఉత్పత్తి గణాంకాలను బేరీజువేసుకున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్… వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇప్పుడప్పుడే కార్యరూపం దాల్చదని పరోక్షంగా చెప్పారు. 2022 ఫిబ్రవరి దాకా ఇదే పరిస్థితి కొనసాగుతుందని జగన్ జోస్యం చెప్పారు.

మే ఒకటో తేదీ నుంచి యుద్ధ ప్రాతిపదికన ప్రారంభం కాబోయే కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏపీ ముఖ్యమంత్రి గురువారం (ఏప్రిల్ 29న) సమీక్షించారు. ‘‘ కోవిడ్‌కు ఇప్పుడు కేవలం వాక్సినేషన్‌ మాత్రమే ఒక పరిష్కారం.. ఈ సమస్య ఎప్పుడు తీరుతుందో కూడా తెలియదు.. దేశంలో వాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 7 కోట్లు కాగా, అందులో కోటి వాక్సిన్లు కోవాక్సిన్‌ (COVAXIN)… మిగిలినవి కోవీషీల్డ్‌ (COVISHIELD).. దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారు 26 కోట్ల మంది ఉన్నారు.. వారికి నాలుగు వారాల వ్యవధిలో రెండో డోస్‌ ఇవ్వాలి.. ఆ మేరకు మొత్తం 52 కోట్ల వాక్సిన్లు కావాలి.. తొలి డోస్‌ ఇప్పటి వరకు కేవలం 15 కోట్ల మందికి మాత్రమే వేశారు.. 2.60 కోట్ల మందికి ఇప్పటి వరకు రెండో డోస్‌ మాత్రమే వేశారు.. మొత్తం కలిపి చూసినా ఇప్పటి వరకు వేసిన కోవిడ్‌ వాక్సిన్‌ డోస్‌లు దాదాపు 18 కోట్లు మాత్రమే.. అంటే ఇంకా 39 కోట్ల వాక్సిన్‌ డోస్‌లు కావాలి.. భారత్‌ బయోటెక్‌ నెలకు కోటి వాక్సిన్లు తయారు చేస్తుండగా, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 6 కోట్ల వాక్సీన్లు తయారు చేస్తోంది.. వీటితో పాటు రెడ్డీ ల్యాబ్స్‌.. ఇతర సంస్థల ఉత్పత్తులు రావడానికి ఇంకా కొన్ని నెలల సమయం పడుతుంది.. అన్నీ కలిపి ఆగస్టు నాటికి కొత్తగా 20 కోట్లు వాక్సీన్లు ఉత్పత్తి కావొచ్చు.. దానికి తోడు ఇప్పుడున్న 7 కోట్లు కూడా కలుస్తాయి.. ఈ లెక్కన 39 కోట్ల వాక్సీన్‌ డిమాండ్‌ వుంది.. కాబట్టి ఆగస్టు లేదా సెప్టెంబరు నాటికి కానీ పూర్తి కాదు.. అదే విధంగా.. 18–45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు దేశంలో 60 కోట్లు ఉన్నారు.. ఆ మేరకు వారికి 120 కోట్ల కరోనా వాక్సిన్‌ డోస్‌లు కావాలి.. 45 ఏళ్లకు పైబడిన వారందరికీ వాక్సినేషన్‌ పూర్తయ్యాక, 18–45 ఏళ్ల మద్య వయస్సు వారికి సెప్టెంబరు నుంచి వాక్సీన్‌ ఇవ్వొచ్చని అంచనా.. ఆ మేరకు వారికి వాక్సినేషన్‌ పూర్తి కావడానికి నాలుగు నెలలు పడుతుంది.. అంటే వచ్చే ఏడాది (2022) జనవరి చివరి నాటికి వారందరికీ వాక్సీన్‌ చేయగలుగుతాము.. ఇదీ వాస్తవ పరిస్థితి.. కాబట్టి వచ్చే ఏడాది దాదాపు ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితి ఉంటుంది.. అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండాలి.. అందుకే శానిటేషన్‌ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.. ’’ అంటూ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

ALSO READ: ఢిల్లీపై పెత్తనం కేంద్రానిదే.. కొత్త చట్టంతో రాజుకుంటున్న రాజకీయ రగడ

ALSO READ: అగ్రరాజ్యానికి అదే టెన్షన్ .. 2 దశాబ్ధాలైనా అదే కలవరం

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు