భారీ భత్యాలతో ఏపీ సర్కారు మరో నియామకం

జగన్ సర్కారు తాజాగా మరో నియామకం చేసింది. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా అంబటి కృష్ణారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కేబినెట్ ర్యాంక్ హోదాలో..

  • Pardhasaradhi Peri
  • Publish Date - 6:55 pm, Thu, 27 August 20
భారీ భత్యాలతో ఏపీ సర్కారు మరో నియామకం

జగన్ సర్కారు తాజాగా మరో నియామకం చేసింది. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా అంబటి కృష్ణారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కేబినెట్ ర్యాంక్ హోదాలో నియమిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నారు. వ్యవసాయరంగానికి సంబంధించిన అంశాలపై కృష్ణారెడ్డి ప్రభుత్వానికి సూచనలు.. సలహాలు చేయనున్నారు. అంబటి కడప జిల్లాకు చెందినవారు.

ఇక.. అంబటి కృష్ణారెడ్డికి చెల్లించే జీతభత్యాలేమిటో చూస్తే.. నెలకు లక్షా 14వేల రూపాయల వేతనం.. అలవెన్సులు కింద రూ.15,000 చెల్లిస్తారు. సొంత కారు ఉంటే ఇందనపు ఖర్చులకోసం నెలకు రూ.30,000, ఇంటి అద్దెకు నెలకు రూ.లక్ష, మంత్రులకు ఇచ్చే విధంగా మెడికల్ రీయింబర్స్ ఉంటాయి. ఇక, సెక్యూరిటీ నియామకం కోసం నెలకు రూ. 25,000, ఇల్లు ఊడ్చే వారికి నెలకు ఆరు వేల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. అంతేకాదు, కారు కొనుక్కోవడానికి రూ.10 లక్షలు లోన్ లేదా అడ్వాన్స్‌గా ప్రభుత్వం ఇవ్వనుంది. ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ కోసం రూ. 50,000, ఫర్నీచర్ కోసం రూ. 3,00,000, వంట సామగ్రి కోసం రూ.1,50,000 లోన్ అందించనున్నారు. ఇంకా వివిధ రకాల సహాయకులను కూడా ప్రభుత్వం అందిస్తుంది.