కమలం పార్టీ నాథుడు… నడ్డా?

భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్య‌క్ష ప‌ద‌వి ఎవ‌రిని వ‌రిస్తుంద‌న్న అంశంపై నెల‌కొన్న స‌స్పెన్స్‌కు తొంద‌ర‌గానే తెర పడింది. దేశ‌వ్యాప్తంగా పార్టీని విజ‌య‌ప‌థంలో న‌డిపించిన అమిత్ షా వార‌సుడెవ‌రో తేలిపోయింది. బీజేపీ జాతీయ అధ్య‌క్షునిగా జేపీ న‌డ్డా నియామకానికి రంగం  సిద్ధమైంది. అమిత్ షా కేంద్ర కేబినెట్‌లో చేర‌డం ఖాయ‌మైంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా సహా మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల వ్యూహాన్ని నడ్డా పర్యవేక్షించనున్నారు. అనంతరం ఈ […]

కమలం పార్టీ నాథుడు... నడ్డా?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 29, 2019 | 5:52 PM

భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్య‌క్ష ప‌ద‌వి ఎవ‌రిని వ‌రిస్తుంద‌న్న అంశంపై నెల‌కొన్న స‌స్పెన్స్‌కు తొంద‌ర‌గానే తెర పడింది. దేశ‌వ్యాప్తంగా పార్టీని విజ‌య‌ప‌థంలో న‌డిపించిన అమిత్ షా వార‌సుడెవ‌రో తేలిపోయింది. బీజేపీ జాతీయ అధ్య‌క్షునిగా జేపీ న‌డ్డా నియామకానికి రంగం  సిద్ధమైంది. అమిత్ షా కేంద్ర కేబినెట్‌లో చేర‌డం ఖాయ‌మైంది.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా సహా మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల వ్యూహాన్ని నడ్డా పర్యవేక్షించనున్నారు. అనంతరం ఈ ఏడాది చివర్లో జమ్మూ కశ్మీర్లో కూడా ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. మరోవైపు కర్నాటక సంకీర్ణ ప్రభుత్వంపైనా బీజేపీ ఓ కన్నేసి ఉంచింది. వచ్చే ఏడాది మొదట్లో దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఎన్నికల హడావిడి మొదలు కానుంది. ఈ నేపథ్యంలో పార్టీ సారథ్య బాధ్యతలు నడ్డాకి అప్పగించాలన్న ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. నడ్డా ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా  కొనసాగుతున్నారు. పార్టీలో ఆయన ఎక్కువ ప్రచారంలో లేకపోయినప్పటికీ… మంచి వ్యూహకర్తగా పేరుంది. ఇటీవల ఉత్తర ప్రదేశ్ ఎన్నికల బాధ్యతలను కూడా ఆయనే చూసుకున్నారు. నడ్డా సారథ్యంలో యూపీలోని మొత్తం 80 స్థానాలకు గానూ బీజేపీ 62 చోట్ల విజయం సాధించింది.