12 ఏళ్ళ అమ్మాయి..ఇక జైన సన్యాసిని
ఈ ప్రపంచంలోని సుఖాలు, భోగాలు అన్నీ అశాశ్వతమని, మోక్షం ఒక్కటే ఇహలోకం నుంచి మనిషిని దూరం చేస్తుందని అంటోంది ఆ కాబోయే బాల సన్యాసిని. ఎక్కడో హిమాలయాలలోనో, జైన, లేదా బౌధ్ధ క్షేత్రాలలోనో కూర్చుని ఆమె ఈ మాటలనడం లేదు. గుజరాత్ లోని సూరత్ లో నివసిస్తున్న 12 ఏళ్ళ అమ్మాయి ఖుషీ షా నిర్ణయమిది. తాను జైన సన్యాసిని కాబోతున్నట్టు ప్రకటించింది. ఆరో తరగతిలో దాదాపు నూటికి నూరు శాతం మార్కులు తెచ్చుకున్న ఈ చిన్నారి […]
ఈ ప్రపంచంలోని సుఖాలు, భోగాలు అన్నీ అశాశ్వతమని, మోక్షం ఒక్కటే ఇహలోకం నుంచి మనిషిని దూరం చేస్తుందని అంటోంది ఆ కాబోయే బాల సన్యాసిని. ఎక్కడో హిమాలయాలలోనో, జైన, లేదా బౌధ్ధ క్షేత్రాలలోనో కూర్చుని ఆమె ఈ మాటలనడం లేదు. గుజరాత్ లోని సూరత్ లో నివసిస్తున్న 12 ఏళ్ళ అమ్మాయి ఖుషీ షా నిర్ణయమిది. తాను జైన సన్యాసిని కాబోతున్నట్టు ప్రకటించింది. ఆరో తరగతిలో దాదాపు నూటికి నూరు శాతం మార్కులు తెచ్చుకున్న ఈ చిన్నారి గత ఏడాది నవంబరులో స్కూలు మానేసింది. అప్పటినుంచే నిరాడంబర జీవితానికి అలవాటు పడింది. తాను జైన సన్యాసిని కావాలనుకుంటున్నట్టు ఖుషీ షా చెప్పగానే మొదట ఆమె తలిదండ్రులు ఆశ్చర్యపోయినా.. ఆ తరువాత స్వాగతించారు. ఇందుకు తమకెంతో గర్వంగా ఉందన్నారు. శాంతి, మోక్షం సాధించాలంటే సన్యాసి జీవితమే గడపాలని చెబుతున్న ఖుషీ షా.. తన బాల్యం లోనే తన కుటుంబంలో నలుగురు ఈ మార్గాన్ని అనుసరించారని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఈమె తండ్రి వినీత్ షా.. మా కూతురు తన ఏడేళ్ల వయస్సులోనే ఈ నిర్ణయం తీసుకుందని, అయితే అప్పుడు వారించామని చెప్పారు. కానీ.. ఇంత త్వరగా ఆమె ఈ మార్గాన్ని అనుసరించనుందని తాము ఊహించలేదన్నారు. ఆమె ఇదివరకే కాలినడకన వందలాది మైళ్ళు అనేక ప్రాంతాలు పర్యటించి దీక్ష తీసుకున్నవారి అనుభవాల గురించి తెలుసుకుందని ఆయన వెల్లడించాడు. ఖుషీ షా త్వరలో శిరో ముండనం చేయించుకుని దీక్ష తీసుకోనుంది. కాగా-గుజరాత్ లో ఇలా చిన్న వయస్సులోనే జైన సన్యాసులుగా మారినవారు చాలామంది ఉన్నారు.