AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కార్లు మానేసి… సైకిళ్లపై తిరగండిః సుప్రీంకోర్టు

దేశ రాజధాని ఢీల్లీ ప్రాంతంలో వాయు నాణ్యత కనిష్ట స్థాయిలకు పడిపోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాల్లో పంట వ్యర్ధాల దహనంపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది

కార్లు మానేసి... సైకిళ్లపై తిరగండిః సుప్రీంకోర్టు
Balaraju Goud
|

Updated on: Oct 30, 2020 | 11:45 AM

Share

దేశ రాజధాని ఢీల్లీ ప్రాంతంలో వాయు నాణ్యత కనిష్ట స్థాయిలకు పడిపోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాల్లో పంట వ్యర్ధాల దహనంపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గాలి కాలుష్యానికి కారణమైన పంట వ్యర్థాల దహనాన్ని నివారించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ధర్మాసనం విచారణ చేపట్టింది. వరి దుబ్బులను కాల్చడమే కాలుష్యానికి ఏకైక కారణం కాదని కొందరు నిపుణులు చెప్పారన్నారు సీజేఐ బాబ్డే. ప్రధాన రహదారులపై కార్ల వాడకాన్ని మానేయాలన్నారు. మనమంతా బైక్స్‌పై వెళ్ళాలి – మోటార్ బైక్స్ కాదు, సైకిళ్లపై అని సూచించారు బాబ్డే. కాలుష్యాన్ని సృష్టిస్తుంది వరి దుబ్బుల కాల్చివేత మాత్రమే కాదని.. అనధికారికంగా కొందరు నిపుణులు చెప్పినట్లు తెలిపారు. ‘మీ సైకిళ్ళను బయటకు తీయవలసిన సమయమం అసన్నమైందన్నారు.

ప్రభుత్వం తరపున వాదనలు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వినిపించారు. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్‌ను జారీ చేసిందని తుషార్ మెహతా తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఈ కాలుష్యం వల్ల ఎవరూ అస్వస్థులు కారాదని, ఒకవేళ ఎవరైనా అస్వస్థులైతే ప్రభుత్వాన్ని బాధ్యులను చేస్తామని చీఫ్ జస్టిస్ హెచ్చరించారు. తదుపరి విచారణ నవంబర్ 6కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం.