కార్పోరేట్ టైకూన్.. ఐటీసీ ఛైర్మన్ కన్నుమూత
దేశీయ కార్పోరేట్ దిగ్గజం, ఐటీసీ ఛైర్మన్ వైసీ దేవేశ్వర్ ఇకలేరు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. వైసీడీగా కార్పోరేట్ రంగానికి సుపరిచితులైన దేవేశ్వర్.. ఐటీసీని ఒక ఎఫ్ఎంసీజీగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. 1968లో ఐటీసీలో చేరిన దేవేశ్వర్.. ఆ తర్వాత క్రమంగా ఎదుగుతూ 1996నాటికి ఎగ్జిగ్యూటివ్ ఛైర్మన్ స్థాయికి చేరారు. 2022 వరకు ఆయన్నే ఐటీసీ ఛైర్మన్‌గా కొనసాగించాలని గతేడాది ఆ సంస్థ నిర్ణయాన్ని కూడా తీసుకుంది. ఈ లోపే […]

దేశీయ కార్పోరేట్ దిగ్గజం, ఐటీసీ ఛైర్మన్ వైసీ దేవేశ్వర్ ఇకలేరు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. వైసీడీగా కార్పోరేట్ రంగానికి సుపరిచితులైన దేవేశ్వర్.. ఐటీసీని ఒక ఎఫ్ఎంసీజీగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు.
1968లో ఐటీసీలో చేరిన దేవేశ్వర్.. ఆ తర్వాత క్రమంగా ఎదుగుతూ 1996నాటికి ఎగ్జిగ్యూటివ్ ఛైర్మన్ స్థాయికి చేరారు. 2022 వరకు ఆయన్నే ఐటీసీ ఛైర్మన్‌గా కొనసాగించాలని గతేడాది ఆ సంస్థ నిర్ణయాన్ని కూడా తీసుకుంది. ఈ లోపే ఆయన మరణం సంస్థకు తీవ్ర లోటుగా మారనుంది. కాగా భారతీయ కార్పోరేట్ చరిత్రలో సుదీర్ఘకాలం ఒక దిగ్గజ కంపెనీకి ఛైర్మన్‌గా కొనసాగిన అతికొద్ది మందిలో ఈయన ఒకరు.



