భారతరత్నకు బ్రేక్.. అదే మంచిదా?

భారతరత్నకు బ్రేక్.. అదే మంచిదా?

భారతరత్న పురస్కారం మరోసారి వివాదాస్పదంగా మారింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వీరసావర్కర్‌కు ఇవ్వాలని ప్రతిపాదించడంతో ఈ పురస్కారం చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. భారతరత్న ఎవరికి ఇవ్వాలి, ఎటువంటి వ్యక్తులు దీనికి అర్హులు అనే విషయంలో ఎన్నోనియమ నిబంధనలు ఉన్నాయి. అయితే ఆధునిక రాజకీయ పరిణామాలను బట్టి భారతరత్న అత్యున్నత పురస్కారం పూర్తిగా రాజకీయాలతో కొట్టుమిట్టాడుతున్నట్టు కనిపిస్తోంది. ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు, చరిత్రలో చెరగని ముద్రను వేసిన వారికి దీన్ని ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. […]

Dr.Pentapati Pullarao

|

Oct 19, 2019 | 5:02 PM

భారతరత్న పురస్కారం మరోసారి వివాదాస్పదంగా మారింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వీరసావర్కర్‌కు ఇవ్వాలని ప్రతిపాదించడంతో ఈ పురస్కారం చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. భారతరత్న ఎవరికి ఇవ్వాలి, ఎటువంటి వ్యక్తులు దీనికి అర్హులు అనే విషయంలో ఎన్నోనియమ నిబంధనలు ఉన్నాయి. అయితే ఆధునిక రాజకీయ పరిణామాలను బట్టి భారతరత్న అత్యున్నత పురస్కారం పూర్తిగా రాజకీయాలతో కొట్టుమిట్టాడుతున్నట్టు కనిపిస్తోంది. ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు, చరిత్రలో చెరగని ముద్రను వేసిన వారికి దీన్ని ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పురస్కారం తరువాత స్ధానాల్లో పద్మశ్రీ,, పద్మభూషణ్, పద్మ విభూషణ్ బిరుదులున్నాయి. ఇటీవల కాలంలో భారతరత్న పురస్కారం ఇచ్చే విషయంలో రాజకీయాల జోక్యం ఎక్కువైంది.

కేంద్రంలో ఉన్న బీజేపీ ఈదఫాలో స్వాతంత్ర సమరయోధుడు వీరసావర్కర్ సేవలను గుర్తించి భారతరత్న ఇవ్వాలని నిర్ణయించింది. దీన్ని రాజకీయ కోణంలో చూసినా, కాకపోయినా ఆయన చేసిన దేశానికి ఆయన చేసిన ఎన్నో ఉన్నాయి. ఈ కారణంంచేత సావర్కర్‌కు భారతరత్న ఇవ్వడం సబబుగానే అనిపిస్తుంది. దేశ స్వాతంత్రం కోసం సావర్కర్ చేసిన పోరాటాన్ని గుర్తించి గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేశారనే విషయాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదు. ఇందిరా తనకు తానుగా పదివేల రూపాయలను సావర్కర్ ట్రస్ట్‌కు విరాళం కూడా ఇచ్చారు. స్వాతంత్రపోరాటం తొలినాళ్లలో సావర్కర్ తన పోరాటంతో బ్రిటీష్ వారికి నిద్రపట్టనివ్వలేదు. దీంతో ఆయన ఎన్నో కష్టాలను అనుభవించారు. జైలు జీవితాన్ని సైతం అనుభవించారు. అయితే ఇవాళ ఆయనపై వస్తున్న విమర్శలు సరికాదని గుర్తించాలి. సావర్కర్ విషయంలో ప్రస్తుతం కొంతమంది చేస్తున్న వాదనల్లో నిజం లేదు. ఎందుకంటే ఆయన ఎంతోమంది అనుకుంటున్నట్టుగా వివాదాస్పద వ్యక్తి కాదని తెలుసుకోవాలి.

మహాత్మా గాంధీ వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో వివాదాలు ఉన్నాయి. ఆయన యువకుడిగా ఉన్న కాలంలో జరిగిన సంఘటనలు కూడా అందరికీ తెలిసినవే. అయినప్పటికీ కాలం మారేకొద్దీ ఆయనలో ఎంతో మార్పు వచ్చింది. ఆఖరికి భారతీయులందరిచేత మహాత్ముడిగా పూజింపబడుతున్నారు. అదే విధంగా సావర్కర్ విషయంలో కూడా తొలినాళ్లలో చిన్న చిన్న విషయాలు జరిగి ఉండవచ్చు. కానీ చివరి వరకు వాటినే ఆయన కొనసాగించలేదు. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ అనేక విషయాల్లో విస్త్రృతమైన పరిఙ్ఞానం పెరుగుతుంది. తద్వారా వారిలో ఆలోచన ధృక్ఫథం కూడా మారుతుంది. అదే వారిని మహనీయులుగా తీర్చిదిద్దుతుంది. వీరసావర్కర్ విషయంలో కొన్ని రాజకీయ పక్షాలు చేస్తున్న విమర్శల్లో నిజం లేదు.

వివాదస్పదమవుతున్న భారతరత్న విషయంలో ఒక విషయాన్ని అంతా ఆలోచించాలి. అసలు మన దేశంలో గతంలో పనిచేసిన ప్రధానులు, రాష్ట్రపతులకు తప్పనిసరిగా భారతరత్న ఇచ్చి తీరాలా? ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్, తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్, ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ వంటి వారికి ఇవ్వాలా? అయితే మనకు స్వాతంత్రానికి తెచ్చిపెట్టిన మహాత్మా గాంధీకి సైతం ఇప్పటివరకు నోబెల్ ప్రైజ్ రాలేదు. అలాగే భారతరత్న కూడా. ఈ అవార్డు ఐకమత్యాన్ని తీసుకురావాల్సింది పోయి అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. అదే సమయంలో వీరసావర్కర్ లాంటి వారు ఎంతోమంది దేశానికి సేవ చేశారు. మరి ఇలాంటి వారికి కూడా ఇవ్వాలా వద్దా? అనే విషయాన్ని కూడా ఆలోచించాలి. మరీ ముఖ్యంగా అసలు భారతరత్న పురస్కారం అనేది ఎవరికి ఇవ్వాలి అనే దానికంటే వివాదాలకు తావు లేకుండా కొంతకాలం దాన్ని ఇవ్వడం నిలిపివేస్తే మంచిదా? అనే విషయంపై చర్చ జరగాలి.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో రచయిత వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతమైనవి. అవి టివీ9 వెబ్‌సైట్ అభిప్రాయాలుగా పరిగణించవద్దని మనవి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu