నడిరోడ్డుపై భర్త వేలం.. ‘శుభలగ్నం’ సీన్ రిపీట్

శుభలగ్నం సినిమా గుర్తుందా..! డబ్బు మీద మోజుతో తన భర్త జగపతిబాబును రోజాకు అమ్మేస్తుంది ఆమని. అయితే ఆ తరువాత వివాహబంధం, భర్త విలువ తెలుసుకోవడం.. డబ్బు ఉంటే అన్ని ఉండవని ఆమని రియలైజ్ అవ్వడం.. చివరకు జగపతిబాబును కలవడం.. ఇలా సుఖాంతంగా క్లైమాక్స్‌ ముగుస్తుంది. కాగా ఈ సినిమాలో భర్తను అమ్మే సీన్ ఇప్పుడు రియల్‌గా జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో ఓ మహిళ భర్త కొన్నాళ్లుగా రమ్య అనే మరో మహిళతో […]

నడిరోడ్డుపై భర్త వేలం.. 'శుభలగ్నం' సీన్ రిపీట్
TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 19, 2019 | 4:29 PM

శుభలగ్నం సినిమా గుర్తుందా..! డబ్బు మీద మోజుతో తన భర్త జగపతిబాబును రోజాకు అమ్మేస్తుంది ఆమని. అయితే ఆ తరువాత వివాహబంధం, భర్త విలువ తెలుసుకోవడం.. డబ్బు ఉంటే అన్ని ఉండవని ఆమని రియలైజ్ అవ్వడం.. చివరకు జగపతిబాబును కలవడం.. ఇలా సుఖాంతంగా క్లైమాక్స్‌ ముగుస్తుంది. కాగా ఈ సినిమాలో భర్తను అమ్మే సీన్ ఇప్పుడు రియల్‌గా జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో ఓ మహిళ భర్త కొన్నాళ్లుగా రమ్య అనే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఎప్పుడూ రమ్య వద్దే ఉంటూ కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేశాడు. దీంతో ఆ భార్య తట్టుకోలేకపోయింది. వారిద్దరి వ్యవహారాన్ని బట్టబయలు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఓ రోజు తన భర్త రమ్య ఇంట్లో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఆమె.. వారిద్దరిని రోడ్డు మీదకు లాగి రచ్చ రచ్చ చేసింది. అయితే, అప్పుడు రమ్య కూడా ఆ మహిళకు సమాధానం ఇచ్చింది. అతడు తన వద్ద డబ్బులు అప్పు తీసుకున్నాడని, ఆ డబ్బులు చెల్లించకపోవడం వలనే తన వద్ద ఉంచుకున్నానని పేర్కొంది.

దీంతో ఆ భార్య కోపం కాస్త నషాళానికి ఎక్కింది. వెంటనే, ‘నా మొగుణ్ణి పర్మినెంట్‌గా నువ్వే ఉంచేసుకో. కానీ, నా జీవితం బాగుండాలి కాబట్టి, ఎంత ఇస్తావో చెప్పు’ అంటూ ఓ ప్రతిపాదనను తీసుకొచ్చింది. దానికి రమ్య వెంటనే స్పందించి.. రూ.5లక్షలు ఇస్తానని.. పర్మినెంట్‌గా అతడిని తనకు ఇచ్చేయాలని చెప్పింది. వెంటనే ఇద్దరు మహిళల మధ్య డీల్ కుదిరింది. ఇక ఈ డీల్ ప్రకారం.. వచ్చే నెల 17వ తేదీన రమ్య రూ.5లక్షలు ఇచ్చి ఆ వ్యక్తిని కొనుగోలు చేయనుంది. అంతేకాదు అదే రోజు తాళిబొట్టును కూడా తీసి ఇచ్చేయాలని రమ్య ఆ మహిళకు మరో కండిషన్‌ను పెట్టిందట. అందుకు ఆమె కూడా ఓకే చెప్పిందట. అయితే ఇదంతా జరుగుతున్న సమయంలో ఆ వ్యక్తి మాత్రం ఏం చేయలేక బిక్కమొహం వేసుకున్నాడట.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu